Asianet News TeluguAsianet News Telugu

హుజూర్‌నగర్‌‌లో కౌంటింగ్‌కు సర్వం సిద్ధం: మహారాష్ట్ర, హర్యానాల్లోనూ రేపే

తెలంగాణ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న హుజూర్‌నగర్ ఉపఎన్నికలో విజేత ఎవరో మరికొద్దిగంటల్లో తేలిపోనుంది. గురువారం ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది

election commission sets all arrangements for huzurnagar counting
Author
Huzur Nagar, First Published Oct 23, 2019, 8:48 PM IST

తెలంగాణ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న హుజూర్‌నగర్ ఉపఎన్నికలో విజేత ఎవరో మరికొద్దిగంటల్లో తేలిపోనుంది. గురువారం ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.

మొత్తం 22 రౌండ్లలో ఓట్లను లెక్కించేందుకు గాను 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ప్రతీ పది నిమిషాలకు ఒక్క రౌండ్ ఫలితం వెలువడే అవకాశం ఉంది. పది గంటల కల్లా ట్రెండింగ్స్ తెలుస్తాయని.. 2 గంటల కల్లా ఫలితం వెలువడుతుందని అధికారులు తెలిపారు.

నియోజకవర్గంలోని 302 పోలింగ్ కేంద్రాల్లో 84.75 పోలింగ్ శాతం నమోదైంది.గత దఫా కన్నా పోలింగ్ శాతం అధికంగా నమోదవ్వడం విశేషం. ఈ పెరిగిన శాతం తమకంటే తమకు లాభం కలిగిస్తుందని ఇటు తెరాస, కాంగ్రెస్ లు తెగ వాదులాడుకుంటున్నాయి.

ఇటు అధికార తెరాస, సిట్టింగ్ కాంగ్రెస్ ఇరు పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోరు ఉత్కంఠంగా మారింది. ఒక రెఫరెండం మాదిరిగా ఈ ఎన్నికను అందరూ భావించడం వల్ల ప్రజలు భారీ సంఖ్యలో ఓట్లు వేశారు.

Also Read:గెలుపెవరిది: మహారాష్ట్ర, హర్యానా కౌంటింగ్.. లైవ్ అప్‌డేట్స్

అటు మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు కూడా గురువారమే వెల్లడికానున్నాయి. ఇందుకు సంబంధించి ఎలక్షన్ కమీషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభంకానుంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి నియోజకవర్గంలో ఐదు వీవీ ప్యాట్ ల స్లిప్పులను కూడా లెక్కించనున్నారు.

మహారాష్ట్ర లో బీజేపీ శివసేనల 'మహాయుతి' కూటమి కాంగ్రెస్-ఎన్సీపీల 'మహా అగాధి' తో తలపడుతోంది. దాదాపుగా 3,237మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో కేవలం 235మంది మాత్రమే మహిళా అభ్యర్థులు బరిలో ఉన్నారు.

288 స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికలకు 96,661 పోలింగ్ బూతులు ఏర్పాటు చేసారు. పూర్తి ఎన్నికల విధుల్లో 6.5 లక్షల మంది సిబ్బంది నిమగ్నమయ్యారు. 

బీజేపీ అగ్రనాయకత్వం అంతా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నరేంద్ర మోడీ నుండి మొదలుకొని అమిత్ షా,రాజ్ నాథ్ సింగ్ తో సహా పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. జాతీయత నే ప్రధాన అజెండాగా బీజేపీ ప్రచారం సాగింది. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తున్నారంటూ ప్రతిపక్షాలను టార్గెట్ చేసారు. 

Also Read:Exit polls 2019: మహారాష్ట్ర, హర్యానాల్లో వార్ వన్‌సైడ్

హర్యానాలోని 90 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ ముఖ్యంగా 4 పార్టీలు పోటీ పడుతున్నాయి. అధికార బీజేపీ, కాంగ్రెస్, ఐఎన్ఎల్డి, జేజేపీ బరిలో ఉన్నాయి. ఆప్,బిఎస్పీలు కూడ బరిలో ఉన్నాయి.

కాంగ్రెస్, బీజేపీలు మినహా ఇతర ఏ పార్టీ కూడా అన్ని సీట్లలో పోటీ చేయడం లేదు. హర్యానాలో బరిలో నిలిచిన అభ్యర్థుల్లో చాల మంది ధనవంతులు ఉన్నారు. రాష్ట్రంలో పార్టీ నేతృత్వం మారిన తరువాత హర్యానాలో కాంగ్రెస్ ఎలాగైనా తన పూర్వ వైభవాన్ని సాధించి తీరుతామని నమ్మకంగా ఉన్నారు.

మరోవైపేమో మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలో మరోసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టి తీరుతామని కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఉన్న 90 సీట్లలో ఎలాగైనా 75 సీట్లు గెలవాల్సిందే అని టార్గెట్ ఫిక్స్ చేసారు. ప్రస్తుతం ఉన్న 90 సీట్లలో బీజేపీకి 48 సీట్లున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో ఉన్న 10 స్థానాలకు 10 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది.

Follow Us:
Download App:
  • android
  • ios