Asianet News TeluguAsianet News Telugu

సచిన్ రికార్డును బద్దలుకొట్టిన రోహిత్ శర్మ...క్రికెట్ చరిత్రలో ఒకేఒక్కడు

వెస్టిండిస్తో మొదలైన వన్డే సీరిస్‌ను టీంఇండియా ఘనంగా ఆరంభించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలు తమ అధ్భుతమైన ఆటతీరుతో సెంచరీలు సాధించి భారీ లక్ష్యాన్ని చేధించారు. రెండో వికెట్‌కు ఈ జోడీ 246 పరుగుల బాగస్వామ్యం నెలకొల్పి సచిన్-గంగూలీల పేరిట వున్న రికార్డును తమ పేరుమీదకు మార్చుకున్నారు. అయితే ఈ సెంచరీ ద్వారా రోహిత్ శర్మ అరుదైన రికార్డును నెలకొల్పాడు. క్రికెట్ గాడ్ సచిన్ పేరిట వున్న రికార్డును బద్దలుకొట్టి ప్రపంచ క్రికెట్ లో ఎవరికీ సాధ్యం కాని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

team india vice captain Rohith Sharma record in oneday cricket
Author
Gauhati, First Published Oct 22, 2018, 4:48 PM IST

వెస్టిండిస్తో మొదలైన వన్డే సీరిస్‌ను టీంఇండియా ఘనంగా ఆరంభించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలు తమ అధ్భుతమైన ఆటతీరుతో సెంచరీలు సాధించి భారీ లక్ష్యాన్ని చేధించారు. రెండో వికెట్‌కు ఈ జోడీ 246 పరుగుల బాగస్వామ్యం నెలకొల్పి సచిన్-గంగూలీల పేరిట వున్న రికార్డును తమ పేరుమీదకు మార్చుకున్నారు. అయితే ఈ సెంచరీ ద్వారా రోహిత్ శర్మ అరుదైన రికార్డును నెలకొల్పాడు. క్రికెట్ గాడ్ సచిన్ పేరిట వున్న రికార్డును బద్దలుకొట్టి ప్రపంచ క్రికెట్ లో ఎవరికీ సాధ్యం కాని రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

విండీస్ నిర్ధేశించిన 323 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ 42.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. అయితే ఈ మ్యాచ్‌లో  రోహిత్‌ శర్మ 152 పరుగులు చేసి నాటౌట్‌గా  నిలిచాడు. ఇలా భారీ లక్ష్యాన్ని చేధించడంతో కెప్టెన్ కోహ్లీకి తోడుగా నిలిచాడు. అయితే ఈ ఇన్నింగ్స్ ద్వారా రోహిత్ మరో రికార్డును నెలకొల్పాడు. వన్డే క్రికెట్ చరిత్రలో ఇలా ఆరుసార్లు 150కి పైగా పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా రికార్డుల్లోకెక్కాడు. 

వన్డేల్లో ఐదుసార్లు 150కి పైగా పరుగులు సాధించిన సచిన్ టెండూల్కర్ పేరిట ఈ రికార్డు ఉండేది. అయితే 2016లో మొహాలీలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో 171 పరుగులు సాధించడం  ద్వారా  రోహిత్ దాన్ని సమం చేశాడు. ఇప్పుడు గౌహతి వన్డేలో మరోసారి 150కి పైగా పరుగులు సాధించి సచిన్ ను అదిగమించాడు. ఇలా అంతర్జాతీయ క్రికెటర్లెవరికీ సాధ్యం కాని అరుదైన రికార్డు రోహిత్ సాధించాడు.   

ఇప్పటి వరకు 189 వన్డేలాడిన రోహిత్‌కు ఇది 20వ సెంచరీ. ఇందులో మూడుసార్లు డబుల్ సెంచరీలు చేశాడు. మొత్తంగా ఆరుసార్లు 150కిపైగా పరుగులు సాధించి వన్డే క్రికెట్ చరిత్రలో ఓ రికార్డును తన పేరిట లిఖించాడు. 
 
మరిన్ని వార్తలు

మరో రికార్డ్ సొంతం చేసుకున్న విరాట్ కోహ్లీ

చెలరేగిన కోహ్లీ, రోహిత్: భారత్ చేతిలో వెస్టిండీస్ చిత్తు

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన భారత స్టార్ బౌలర్

వెస్టిండీస్ పై వన్డే: షమీ చెత్త రికార్డు

ఇండియాపై రికార్డు సాధించిన విండీస్ బ్యాట్స్ మన్

Follow Us:
Download App:
  • android
  • ios