నేటి విశేష వార్తలు సిద్దిపేటలో బహుజన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న విమలక్క విజయవాడ అమ్మవారిని దర్శించుకున్న 55,000 మంది భక్తులు 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ''మా తెలంగాణ" పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా గద్దర్ శ్రీవారికి ముఖ్యమంత్రి పట్టు వస్త్రాల బహూకరణ నేడు గాయత్రి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న విజయవాడ అమ్మవారు బతుకమ్మ పాటల సీడిని ఆవిష్కరించిన చీఫ్ జస్టిస్ రమేష్ రంగనాథన్
అమ్మకానికి వాంఖడే స్టేడియం పేరు,,

ముంబై లోని వాంఖడే స్టేడియం పేరు మారబోతోంది. ఈ స్టేడియానికి తమ పేరు పెట్టుకుని తమ బ్రాండ్ విలువను పేంచుకోవాలని మూడు సంస్థలు ముందుకొచ్చాయి. రిలయన్స్ గ్రూప్, డీడీబి సంస్థ తో పాటు బేస్ లైన్ సంస్థ ఈ స్టేడియం కు తమ సంస్థ పేరును జతచేయాలని చూస్తున్నాయి. ఇందుకోసం ముంబై క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించిన 100 కోట్లను చెల్లించి పేరును కొనుగోలు చేయడానికి మూడు సంస్థలూ ముందుకొచ్చాయి. చూడాలి ఈ అవకాశం ఎవరికిదక్కతుందో.
సిద్దిపేటలో బహుజన బతుకమ్మ సంబరాలు

సిద్దిపేట జిల్లాలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. అరుణోదయ కళా సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న బహుజన బతుకమ్మ సంబరాల్లో విమలక్క పాల్గొన్నారు. ఈ దొరల పాలనలో బహుజన బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఈ బహుజన బతుకమ్మ సంబరాలు జరుగనున్నాయి. సామాజిక అసమానతలు రూపుమాపడానికి ఈ బహుజన బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నట్లు విమలక్క అన్నారు.
దసరాకు ప్రత్యేక బస్సులు

దసరా పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ నుండి తమ సొంత ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని 3,600 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు టీఎస్ ఆర్టీసి అధికారులు తెలిపారు. ఈ బస్సులను తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాలకు నడపనున్నారు. హైదరాబాద్ నుండి తెలంగాణలోని ప్రతి జిల్లాకు అరగంటకో బస్ ఉండేలా ఏర్పాటు చేసినట్లు, ఈ విధంగా ఈ నెల 29 వరకు కొనసాగిస్తామని ఆర్టీసి అధికారులు తెలిపారు.
విజయవాడ అమ్మవారిని దర్శించుకున్న 55,000 మంది భక్తులు

దుర్గగుడి ఈవో సూర్యకుమారి అందించిన సమాచారం
👉🏾 గాయత్రి దేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని సాయంత్రం వరుకు 55,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
👉🏾 300 /- టికెట్స్ 3386కొనుగోలు
👉🏾100 /- టికెట్స్ 4154 కొనుగోలు జరిగాయి...
👉🏾 47680 లడ్డూ అమ్మకాలు
👉🏾23200 పులిహార అమ్మకాలు
👉🏾 అన్నదానంలో 8834 భక్తులు పాల్గొన్నారు....
👉🏾 సాయంత్రం సమయంలో భక్తుల రద్దీ పెరుగుతుంది.
👉🏾 27 వ తారీఖున ఏపి సీయం చంద్రబాబు అమ్మవారి దర్శనానికి రాబోతున్నారు...
👉🏾 తెలంగాణ సీయం కేసీఆర్ ఎప్పుడొస్తారనేది ఇంకా కన్ఫార్మ్ అవ్వలేదు..
జేఎన్టీయు - సిఐఐ ల మద్య అవగాహన ఒప్పందం

ఇంజనీరింగ్ విద్యార్థులకు పరిశోధనలో శిక్షణ, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చే ఉద్దేశ్యంతో జేఎన్టీయు, సిఐఐల మధ్య విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి సమక్షంలో ఒప్పందం కుదిరింది.ఇలా పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య నిరంతరం మంచి సంబంధాలుండాలని ఉప ముఖ్యమంత్రి కడియం అన్నారు. దీనివల్ల తెలంగాణ విద్యార్థులకు అంతర్జాతీయంగా ఉన్న కంపెనీలలో అవకాశాలు లభిస్తాయని, విద్యార్థి దశలోనే ఆయా కంపెనీలకు కావల్సిన నైపుణ్యాన్ని కూడా పొందడానికి వీలవుతుందన్నారు. ఈ విధంగా ఇటు విధ్యార్థులు, అటు కంపెనీలు లబ్ధి పొందనున్నాయని ఆయన తెలిపారు.
విశ్వవిద్యాలయాలు,పరిశ్రమలకు మధ్య ఒప్పందాలు కుదుర్చడంలో డిప్యూటీ సిఎం శ్రద్ధ సిఐఐ చైర్మన్ రాజన్న అభినందనందించారు.
సింగరేణి ప్రచారంలో కాంగ్రెస్ నేతలు

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అందులో భాగంగా ఇవాళ కాంగ్రెస్ అనుభంద గుర్తింపు సంఘం ఐఎన్టీయూసీ తరపున కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ కుంతియా , రాష్ట్ర అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. ఆర్ జీ 3 పరిధిలోని ఓసీబి 1 వద్ద జరిగిన సమావేశంలో లో ఉత్తమ్ మాట్లాడుతూ... సింగరేణి కార్మికులను ఇన్నాళ్లు పట్టించుకోని ప్రభుత్వం ఇపుడు ఎన్నికలు రాగానే సవతి తల్లి ప్రేమను చూపిస్తుందని విమర్శించారు. వీరి మాయమాటలకు పడకుండా ఆలోచించి ఓటేయాలని ఉత్తమ్ కార్మికులకు సూచించారు.
2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్ధిగా గద్దర్

2019 అసెంబ్లీ ఎన్నికల్లో ''మా తెలంగాణ" పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సామాజిక ఉద్యమకారుడు గద్దర్ ను బరిలో కి దించనుంది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ అద్యక్షుడు వీరారెడ్డి ప్రకటించారు, దీనిపై వచ్చేనెల 29 న జరిగే మేధోమధనం లో కార్యకర్తల నుంచి సలభాలు సూచనలు తీసుకుంటామని ఆయన తెలిపారు. సామాజిక తెలంగాణ నిర్మానానికి సామాజిక ఉద్యమకారులే సారథ్యం వహించాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వీరారెడ్డి తెలిపారు.
బతుకమ్మ పాటల సీడిని ఆవిష్కరించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ రమేష్ రంగనాథన్

తెలంగాణ జాగృతి ఆద్వర్యంలో రూపొందిన బతుకమ్మ పాటల సీడీని హైకోర్టు చీఫ్ జస్టిస్ రమేష్ రంగనాథన్ హై కోర్ట్ ప్రాంగణంలో ఆవిష్కరించారు. ప్రజల నోళ్లలో నానుతున్న ప్రముఖ జానపద గాయకులు తయారు చేసిన పాటలను సీడిల రూపంలో ఒక్క దగ్గరకు చేర్చి ప్రతిసంవత్సరం జాగృతి విడుదల చేస్తుంది. సాంప్రదాయ బతుకమ్మ పాటలు వెలకట్టలేని గొప్ప మౌఖిక సాహిత్యమని, వాటిని సేకరించి రికార్డు చేయడం మంచి విషయమని,దీనికి పూనుకున్న తెలంగాణ జాగృతి ప్రతినిధులను జస్టిస్ రంగనాథన్ అభినందించారు.
గాయత్రీ దేవిగా దర్శనమిస్తున్న విజయవాడ కనకదుర్గమ్మ

దసరా ఉత్సవాలు లో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ ఇవాళ గాయత్రీ దేవి గా భక్తులకు దర్శనం ఇస్తోంది. భక్తులు ఉదయం నుండి పెద్ద సంఖ్యలో ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. ఈ రోజు నుండి ఏపిలో పాఠశాలలకు సెలవులు కావటంతో పెద్ద సంఖ్యలో వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
శ్రీవారికి ముఖ్యమంత్రి పట్టు వస్త్రాల బహూకరణ

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం (ఈరోజు)విజయవాడ నుంచి సాయంత్రం 4.45 కి బయలుదేరి 5.45 కితిరుమలకు చేరుకుంటారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్బంగా ధ్వజారోహణం నిర్వహించనున్నారు. సాయంత్రం 5.48 నుంచి 6 గంటల మధ్య ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది. మధ్యాహ్నం మాడవీధుల్లో శ్రీవారి పరివార దేవతలు, గరుడ పఠం ఊరేగనున్నారు. కాగా... శ్రీవారికి సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అనంతరం 2018 క్యాలండర్, డైరీ, టీటీడీ తెలుగు వెబ్‌సైట్‌ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించనున్నారు.ఆయన రాత్రికి తిరుమల పద్మావతి గెస్ట్ హౌస్ లో నే బస చేస్తారు.(ఫైల్ ఫోటో)
