Asianet News TeluguAsianet News Telugu

‘ఆరే’ కాలనీలో చెట్ల నరికివేత.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు

కార్ షెడ్ కోసం ఉత్తర ముంబైలోని ఆరే కాలనీలోని సుమారు 2,200 చెట్లను తొలగిస్తున్నారు. వీటి తొలగింపుకు ట్రీ అథారిటీ ఆమోదం తెలిపింది. దీంతో స్థానికులు, పర్యావరణ ఉద్యమకారులు చెట్ల నరికివేతను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. చెట్ల నరికివేతను నిలిపేయాలంటూ బోంబే హైకోర్టు ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. 

Don't cut anymore trees, says SC on Mumbai's Aarey
Author
Hyderabad, First Published Oct 7, 2019, 12:24 PM IST

దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరంలోని ఆరే కాలనీలో చెట్ల నరికివేతపై  సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆరే కాలనీలో ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం చెట్లు నరికి వేసింది. దీంతో.. చెట్లు నరికివేయడాన్ని వ్యతిరేకిస్తూ.. ఆ కాలనీవాసులు, ప్రకృతి ప్రియులు ఆందోళన చేపట్టారు. చివరకు సుప్రీం కోర్టు.. ఆ కాలనీవాసులకు, ప్రకృతి ప్రియులకు మద్దతుగా తీర్పు వెల్లడించింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ముంబయిలోని మెట్రో కార్ షెడ్డు కోసం ఆరే కాలనీలో చెట్లు నరికివేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందుకు చర్యలు తీసుకోగా.. ఓ న్యాయశాస్త్ర విద్యార్థి ఇందుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పై ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. కాగా... ఆ కాలనీలో చెట్లు నరకవద్దంటూ న్యాయంస్థానం తీర్పు ఇచ్చింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. 

కార్ షెడ్ కోసం ఉత్తర ముంబైలోని ఆరే కాలనీలోని సుమారు 2,200 చెట్లను తొలగిస్తున్నారు. వీటి తొలగింపుకు ట్రీ అథారిటీ ఆమోదం తెలిపింది. దీంతో స్థానికులు, పర్యావరణ ఉద్యమకారులు చెట్ల నరికివేతను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టారు. చెట్ల నరికివేతను నిలిపేయాలంటూ బోంబే హైకోర్టు ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. 

నోయిడా న్యాయ శాస్త్ర విద్యార్థి రిషవ్ రంజన్ ఆదివారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌కు లేఖ రాశారు. చెట్లను కాపాడాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు. ఈ లేఖను ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణిస్తూ ఇవాళ ప్రత్యేక ధర్మాసనం విచారణ జరుపనున్నట్టు సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో వెల్లడించారు. మిథి నది ఒడ్డున ఆరే ప్రాంతంలోని 33 హెక్టార్ల విస్తీర్ణంలో ముంబై మెట్రో కార్ షెడ్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రదేశంలో దాదాపు 3,500 చెట్లు ఉండగా... 2,238 చెట్లను తొలగించాలని నిర్ణయించడంతో వివాదం మొదలైంది.

Follow Us:
Download App:
  • android
  • ios