Asianet News TeluguAsianet News Telugu

`కల్కి2898ఏడీ` కొత్త రిలీజ్‌ డేట్‌ ఇదే?.. కరెక్ట్ గా రెండు నెలలు.. ఫ్యాన్స్ కి ఊరట

ప్రభాస్‌ నటిస్తున్న `కల్కి2898ఏడీ` కోసం ప్రపంచమే వెయిట్‌ చేస్తుంది. కానీ టీమ్‌ వాయిదాల మీద వాయిదాలు వేస్తుంది. తాజాగా ఓ డేట్‌ని లాక్‌ చేశారట. అదే ఇప్పుడు వైరల్‌ అవుతుంది.
 

kalki2898ad new release date lock by makers here new date arj
Author
First Published Apr 27, 2024, 6:47 AM IST

ప్రభాస్‌ నటిస్తున్న `కల్కి2898ఏడీ` చిత్రం కోసం అంతా వెయిట్‌ చేస్తున్నారు. ప్రభాస్‌ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఇండియన్‌ సినీ లవర్స్ అంతా వెయిట్‌ చేస్తున్నారు. అంతేకాదు గ్లోబల్‌ ఫ్యాన్స్ ని కూడా వెయిట్‌ చేయిస్తున్న మూవీ `కల్కి2898ఏడీ`. దర్శకుడు అశ్విన్‌ ఈ మూవీలో ఏంచూపించబోతున్నాడు, ఎలా చూపించబోతున్నాడనేది అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. సైన్స్ కి, మైథలాజికల్‌ అంశాలకు ఎలా ముడిపెట్టాడనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. 

ఇప్పటి వరకు విడుదలైన గ్లింప్స్, టీజర్లలో మాత్రం కంటెంట్‌ పరంగా ఎలాంటి క్లూ లేదు. జస్ట్ పాత్రలను, కొన్ని సీన్లని మాత్రమే చూపించారు. కానీ సినిమా ఏంటనేది అర్థం కాలేదు. అదే సమయంలో అవి కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేవు. కానీ ఏదో క్యూరియాసిటీ, నాగ్‌ అశ్విన్‌ ఏం చెప్పబోతున్నాడనేది ఆసక్తికరంగా మారింది. నాగ్.. కంటెంట్ ఉన్నోడు, అంత ఆశామాషీ కాదని అందరికి తెలుసు. అదే ఇప్పుడు ఈ సినిమాపై అంచనాలను, ఆసక్తిని పెంచుతుంది. 

అయితే రిలీజ్‌ డేట్‌కి సంబంధించి సస్పెన్స్ చాలా కాలంగా కొనసాగుతుంది. మే 9న విడుదల కావాల్సిన ఈ మూవీ వాయిదా పడుతుందని అన్నారు. ఎన్నికలు, పోస్ట్ ప్రొడక్షన్‌ వర్క్ కంప్లీట్‌ కాకపోవడంతో వాయిదా వేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ టీమ్‌ నుంచి ఎలాంటి రియాక్షన్‌ లేదు. ఈ నేపథ్యంలో తాజాగా అప్‌ డేట్‌ని ఇవ్వబోతున్నట్టు ప్రకటించింది. ఈ రోజు(ఏప్రిల్‌ 27) సాయంత్రం ఐదు గంటలకు అప్‌ డేట్‌రాబోతుందని, ఇక వెళ్లడించే టైమ్‌ వచ్చిందని నిర్మాణ సంస్థ సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది. 

మరి సినిమా కొత్త డేట్‌ ఎప్పుడనేది పెద్ద ఇంట్రెస్టింగ్‌ పాయింట్. అయితే చిత్ర వర్గాల నుంచి, టాలీవుడ్‌ వర్గాల నుంచి తెలుస్తున్న సమాచారం మేరకు `కల్కి 2898 ఏడీ` కొత్త డేట్‌ ఫైనల్‌ అయ్యిందట. సాయంత్రం ఆ డేట్‌ని ప్రకటించబోతున్నట్టు తెలుస్తుంది. మనకు తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీ జూన్‌ 27న రాబోతుందని, టీమ్‌ ఆ డేట్‌ని టాక్ చేసిందని సమాచారం. అయితే మొన్నటి వరకు మే 30 లేదంటే జూన్‌ మొదటి వారంలో వస్తుందని భావించారు. కానీ జూన్‌ చివరికి వెళ్లిపోయిందని లేటెస్ట్ ఇన్‌ఫర్మేషన్‌. మరి టీమ్‌ ఇదే డేట్‌కి ఫిక్స్ అయి ఉంటుందా? లేదా మారుస్తుందా అనేది సాయంత్రం ఓ క్లారిటీ వస్తుంది. 

ఇదే నిజమైతే ఇక `కల్కి2898ఏడీ` రిలీజ్‌కి కరెక్ట్ గా రెండు నెలలు ఉంది. సరిగ్గా ఆరవై రోజుల్లో ఈ మూవీ రాబోతుందని చెప్పొచ్చు. కానీ ఇది మరీ లాంగ్‌ డిలే అని చెప్పొచ్చు. అయితే ఎట్టకేలకు ఫస్టాఫ్‌లోనే వస్తుందని, మరీ సెకండాఫ్‌కి వెళ్లకుండా ముందుగానే వస్తుందనే వార్త అభిమానుల్లో సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ మూవీ కోసం డార్లింగ్‌ ఫ్యాన్స్ దాదాపు నాలుగేళ్లుగా వెయిట్‌ చేస్తున్న విషయం తెలిసిందే. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో ప్రభాస్, అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొనె, దిశా పటానీతోపాటు యంగ్‌ హీరోలు ముగ్గురు గెస్ట్ రోల్‌ చేస్తున్నారు, ఇద్దరు హీరోయిన్లు మెరుస్తారని సమాచారం. అశ్వినీదత్‌ ఈ మూవీని సుమారు ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios