Asianet News TeluguAsianet News Telugu

ముఖ్యమంత్రి ఇంటికి బాంబు బెదిరింపు

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఇంటికి బాంబు బెదిరింపు వచ్చింది. సీఎం ఇంట్లో బాంబు పెట్టామని అది కాసేపట్లో పేలిపోతుందని సోమవారం రాత్రి బెంగళూరు పోలీస్ కంట్రోల్ రూమ్‌కి ఒక గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది.

bomb threatening call for Karnataka CM kumaraswamy
Author
Bengaluru, First Published Dec 19, 2018, 9:21 AM IST

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఇంటికి బాంబు బెదిరింపు వచ్చింది. సీఎం ఇంట్లో బాంబు పెట్టామని అది కాసేపట్లో పేలిపోతుందని సోమవారం రాత్రి బెంగళూరు పోలీస్ కంట్రోల్ రూమ్‌కి ఒక గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది.

దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు, ముఖ్యమంత్రి భద్రతా విభాగం, బాంబు స్క్వాడ్‌తో కలిసి బెంగళూరు జేపీ నగర్‌లోని సీఎం కుమారస్వామి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎటువంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో ఇది ఆకతాయి పనిగా నిర్ధారించారు. అనంతరం కంట్రోల్ రూమ్‌కి వచ్చిన నెంబర్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేశారు. పోలీసులను తప్పుదారి పట్టించడానికే తన పేరు గోపాల్‌గా మార్చి చెప్పినట్లు అంగీకరించారు. 
 
Follow Us:
Download App:
  • android
  • ios