Asianet News TeluguAsianet News Telugu

మోదీ ఫోటో వుంటేనే ఓటేస్తామన్న మహిళలు... ప్రధాని రియాక్షన్ ఇదే..!

ప్రధాని మోదీ ప్రజాభిమానాన్ని తెలియజేసే వార్తను ఆయనకు ఎక్స్ మాధ్యమం ద్వారా తెలియజేసాడో రాజస్థాన్ బిజెపి నాయకుడు. ఇది చూసి ఉప్పొంగిపోయిన ప్రధాని ఆసక్తికరమైన రిప్లై ఇచ్చాడు. 

PM Modi replies Rajasthan BJP Leader Laxmikant Bharadwaj Tweet AKP
Author
First Published Apr 25, 2024, 1:40 PM IST

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మాతో పాటు గత పదేళ్ల పాలనను ప్రజల్లోకి తీసుకెళుతూ బిజెపి ఎన్నికలకు వెళుతోంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని... ఆయనే మూడోసారి ప్రధానిగా వుండాలని అత్యధికశాతం ప్రజలు కోరుకుంటున్నారని సర్వేలు చెబుతున్నాయి. మోదీ దేశ ప్రజలకు ఎంత దగ్గరయ్యారో తెలియజేసే సంఘటన ఒకటి రాజస్థాన్ లో చోటుచేసుకుంది. దీన్ని ఓ బిజెపి నేత ప్రధాని దృష్టికి తీసుకెళ్లగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు. 

అసలు విషయం ఏమిటంటే... ''రాజస్థాన్ రాష్ట్రంలోని సికార్ జిల్లాలో మొదటి విడతలో పోలింగ్ జరిగింది. ఈ క్రమంలోనే పిప్రలి గ్రామంలోని ఓ స్కూల్లోని పోలింగ్ కేంద్ర వద్ద ఓటుహక్కును వినియోగించుకునేందుకు చాలామంది ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే సాంప్రదాయ జానపద పాటలు పాడుతూ కొందరు మహిళలు ఓటు వేయడానికి వచ్చారు. ఓటు వేయడానికి మహిళలు లోపలికి వెళ్లగానే పెద్ద శబ్దంచేస్తూ అరిచారు. ఈవిఎం మిషన్ పై మోదీ ఫోటో లేకపోవడంతో వారు అలా అరిచారు. అయితే పోలింగ్ అధికారులు మోదీ ఫోటోలు ఈవిఎంపై వుండవని...ఆయన తరపున ప్రాతినిధ్యం వహించేవారి ఫోటోలు వుంటాయని సముదాయించారు. దీంతో సదరు మహిళలు ఓటుహక్కును వినియోగించుకున్నారు'' అంటూ ఓ న్యూస్ పేపర్ లో వార్త వచ్చింది.  దీన్ని మోదీకి ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసారు రాజస్థాన్  బీజేపీ అధికార ప్రతినిధి లక్ష్మీకాంత్ భరద్వాజ్.

''చదువుకోని గ్రామీణ మహిళలు కూడా ఈవిఎం లపై మోదీ ఫోటో వుంటేనే ఓటేస్తామని అంటున్నారు. ఆయన ఫోటో ఎక్కడుందని వెతుకుతున్నారు. కానీ కొందరు కల్లబొల్లి మాటలతో మోడీని ఓడించగలం అనుకుంటున్నారు. మోదీజీ ప్రజల హృదయాలను పరిపాలిస్తున్నారు... ఈ విషయం అవినీతి కుటుంబానికి ఎప్పుడు అర్థం అవుతుందో'' అంటూ ట్వీట్ చేసాడు.

అయితే లక్ష్మీకాంత్ భరద్వాజ్ ట్వీట్ పై ప్రధాని మోదీ స్పందించారు. ''తల్లులు, చెల్లెమ్మల ఆప్యాయత చూస్తుంటే నా కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి, వారి రుణం తీర్చుకోవాలనే సంకల్పం కూడా కలిగింది.లక్ష్మీకాంత్ జీ... మన అభ్యర్థులను ప్రజలవరకు తీసుకుని వెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తది. ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజలకు అవగాహన కల్పించాలి'' అంటూ ప్రధాని మోదీ రిప్లై ఇచ్చారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios