Asianet News TeluguAsianet News Telugu

పెళ్లి ఊరేగింపులో అమరవీరులకు నివాళి..వధూవరులపై ప్రశంసలు

పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన 43 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లకు దేశ ప్రజలు ఘన నివాళి అర్పిస్తున్నారు. సోషల్ మీడియాతో పాటు మౌన ప్రదర్శనల ద్వారా అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు.

ahead of their marriage couple to pay tribute to the CRPF Martyrs
Author
Vadodara, First Published Feb 18, 2019, 12:21 PM IST

పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన 43 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లకు దేశ ప్రజలు ఘన నివాళి అర్పిస్తున్నారు. సోషల్ మీడియాతో పాటు మౌన ప్రదర్శనల ద్వారా అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు.

తాజాగా పెళ్లి ఊరేగింపులో అమర జవాన్లకు నివాళుర్పించి తమ దేశభక్తిని చాటుకున్నారు నూతన వధూవరులు. వివరాల్లోకి వెళితే..  గుజరాత్‌లోని వడోదరాకు చెందిన కొత్తజంట, తమ  వివాహానికి ముందు జరిగిన పెళ్లీ ఊరేగింపులో భాగంగా గుర్రపు రథంలో కూర్చొన్న వధూవరులు జాతీయ జెండాతో పాటు.. ఓ ఫ్లకార్డును ప్రదర్శించారు.

దేశంలో కేవలం 1427 పులులు మాత్రమే ఉన్నాయని ఎవరు అన్నారు. 13 లక్షల పులులు దేశ సరిహద్దులో కాపలా కాస్తున్నాయని ఆ ఫ్లకార్డులో పేర్కొన్నారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురే కాకుండా వివాహ వేడుకకు హాజరైన ప్రతి ఒక్కరు జాతీయ జెండాను చేతపట్టుకుని జవాన్లకు నివాళులర్పించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios