Asianet News TeluguAsianet News Telugu

Railway Recruitment 2022: రాత పరీక్ష లేకుండానే, నేరుగా ఇంటర్వ్యూ ద్వారా రైల్వే జాబ్, పూర్తి వివరాలు ఇవే...

రాత పరీక్ష లేకుండా, నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఇండియన్ రైల్వేస్ తమ స్కూల్స్ లో ఉపాధ్యాయుల భర్తీని చేపట్టింది. ఈ భర్తీ ద్వారా మొత్తం 52 పోస్టుల ఖాళీలను ఫిల్ చేయానున్నారు. ఆసక్తి కలిగిన యువతీ యువకులు నేరుగా ఇంటర్వ్యూ కు హాజరు అయ్యేందుకు అర్హతలను తెలుసుకోండి. 

Railway Recruitment 2022 apply 52 posts of teachers check details
Author
Hyderabad, First Published Mar 19, 2022, 3:56 PM IST

Railway Recruitment 2022: ఇండియన్ రైల్వేస్ ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థల్లో ఒకటి, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని ఈ సంస్థలో ఉద్యోగం చేసేందుకు నిరుద్యోగ యువత ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు.అందుకు కారణం లేకపోలేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం కావడంతో పాటు ఉద్యోగ భద్రత, వేతనం, వసతి సదుపాయాలు ఉంటాయి. ఈ కారణంగానే యువత ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. 

భారతీయ రైల్వేల్లో టీచింగ్ పోస్టుల కోసం ఇండియన్ రైల్వేస్ నోటిపికేషన్ విడుదల చేసింది. మొత్తం 52 ఖాళీలను ఈ ప్రక్రియలో రిక్రూట్ చేయనున్నారు. ఆసక్తి కలిగిన యువతీ, యువకులు నేరుగా ఇంటర్వ్యూకు వెళ్లడం ద్వారా ఉద్యోగం సాధించవచ్చు. 

పూర్తి వివరాల్లోకి వెళితే ఇండియన్ రైల్వేస్ వివిధ ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఇక్కడ విడుదల చేసిన రిక్రూట్‌మెంట్ ప్రకటనను తనిఖీ చేయవచ్చు.

నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే (NFR) ద్వారా ఈ పోస్టుల రిక్రూట్‌మెంట్ జరగనుంది. గింది. అభ్యర్థులు తమ అర్హతను బట్టి ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 52 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది.

రైల్వే రిక్రూట్‌మెంట్ 2022: (Railway Recruitment 2022) ఖాళీలు ఇవే..
PGT - 4 పోస్టులు
TGT - 22 పోస్టులు
PRT - 13 పోస్టులు
కాంట్రాక్ట్ కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్ - 6 పోస్టులు
కాంట్రాక్ట్ డ్యాన్స్ టీచర్ - 2 పోస్టులు
కాంట్రాక్ట్ మ్యూజిక్ టీచర్ - 2 పోస్టులు
కాంట్రాక్ట్ కరాటే/కుంగ్ ఫూ ఇన్‌స్ట్రక్టర్ - 1 పోస్ట్
కాంట్రాక్టు స్పోకెన్ ఇంగ్లీష్ - 2 పోస్ట్‌లు

రైల్వే రిక్రూట్‌మెంట్ 2022:  (Railway Recruitment 2022) విద్యార్హతలు ఇవే:
పీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి. అలాగే, అభ్యర్థి B.Ed లో డిగ్రీ కలిగి ఉండాలి. అయితే TGT పోస్టులకు, అభ్యర్థి B.Edతో గ్రాడ్యుయేషన్ డిగ్రీని కలిగి ఉండాలి. ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన మరింత విద్యార్హత మరియు ఇతర సమాచారం కోసం, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసిన ప్రకటనను చూడవచ్చు.

రైల్వే రిక్రూట్‌మెంట్ 2022:  (Railway Recruitment 2022) వయో పరిమితి: 
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి వయస్సు 18 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య ఉండాలి.

రైల్వే రిక్రూట్‌మెంట్ 2022:  (Railway Recruitment 2022) ఎంపిక ప్రక్రియ
ఈ పోస్టులన్నింటికీ దరఖాస్తుదారులు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయబడతారు. అభ్యర్థులు వారి అర్హతను బట్టి షెడ్యూల్ తేదీలో జరిగే ఇంటర్వ్యూ ప్రక్రియకు హాజరు కావచ్చు.

రైల్వే రిక్రూట్‌మెంట్ 2022:  (Railway Recruitment 2022) వీటిని గుర్తుంచుకోండి
ఇంటర్వ్యూ తేదీ - 1 ఏప్రిల్ 2022
సమయం - ఉదయం 10 గంటల నుండి ప్రారంభం కానుంది..

మరిన్ని వివరాల కోసం ఇక్కడ పేర్కన్న లింక్ క్లిక్ చేసి తెలుసుకోండి. 

Follow Us:
Download App:
  • android
  • ios