Asianet News TeluguAsianet News Telugu

ఊబెర్ అత్యుత్సాహం, స్వస్తిక పేరున్న మహిళ పై నిషేధం..చివరకు ఏం చేసిందంటే..?

ప్రముఖ ఆన్ లైన్ సంస్థ ఊబెర్ అత్యుత్సాహంతో భారతీయ మహిళను అవమానించింది. స్వస్తిక అనే పేరున్న  మహిళ అకౌంట్ ను బ్యాన్ చేసి ఇబ్బందులకు గురి చేసింది. ఇంతకీ విషయం ఏంటంటే..? 

Uber apologizes Bans Woman Called Swastika Chandra Over Her Name JMS
Author
First Published Apr 21, 2024, 1:11 PM IST

ప్రముఖ ఆన్ లైన్ డెలివరీ సంస్థ ఊబెర్ భారతీయ మహిళను అవమానపరిచింది. స్వస్తిక పేరున్న ఓ మహిళపై నిషేధం విధించిన ఊబెర్.. చివరకు తన తప్పును తెలుసుకుని  బాధితురాలికి క్షమాపణలు కూడా  చెప్పింది. అయితే ఈ సంఘటన  ఆస్ట్రేలియాలో జరిగింది. ప్రస్తుతం సోషల్ మీదియాను కుదిపేస్తోన్న ఈవిషయంలో అసలు ఏంజరిగిందంటే..  పూర్తి వివరాల్లోకి వెళితే, ఇండియాలో పుట్టిన  స్వస్తిక చంద్ర ఆతరువాత ఉపాది కోసం  ఆస్ట్రేలియాకు వెళ్లింది. అక్కడ గతేడాది అక్టోబర్‌లో  ఊబెర్ ఈట్స్‌లో పుడ్ ను ఆర్డర్ చేయడం కోసం ప్రయత్నించింది. 

అయితే అప్పుడు ఫుడ్ ఆర్డర్ సంగతి తరువాత..ముందు తన ప్రోఫైల్ పేరు మార్చాలని.. తన పేరు జర్మనీ నియంత హిట్లర్ కు ముడి పడి ఉందని తమనిబంధనలకు విరుద్దమంటూ.. స్వస్తిక అకౌంట్ ను బ్యాన్ చేశారు. ఆమె నిబంధనలను పాటించడంలేదంటూ.. ఊబెర్ ఆమె అకౌంట్‌పై నిషేధం  విధించింది.

అయితే, హిందూ మతంలో ముఖ్యభాగమైన స్వస్తిక పదాన్ని మార్చేదేలేదంటూ బాధితురాలు పోరాటం స్టార్ట్ చేసింది. ఆ దేశంలో ఉన్న హిందూసంఘాలసహాయం తీసుకుంది.  తన పోరాటం ప్రారంభించింది. ఆస్ట్రేలియాలోని హిందు సంస్థలన్ని తనకుసాయం చేయడం కోసం ముందుకు వచ్చాయి. వారి సహాయంతో ఆమె  ఊబెర్‌కు జరిగిన పొరాపాటు గురించి వివరించింది. 

అయితే హిట్లర్ హిందూ మతానికి సబంధించిన పదాన్ని ఎలా ఉపయోగించుకున్నాడో వివరించారు. అంతే కాదు వేల ఏళ్ల చరిత్ర కలిగిన హిందూ మతానికి చెందిన పదాన్ని హిట్లర్ 1920ల్లో తనకు అనుకూలంగా మార్చుకున్నాడని చెప్పింది. ఈ అంశంపై స్పష్టత రావడంతో ఊబెర్ తాజాగా ఆమె అకౌంట్‌ను పునరుద్ధరించింది. అంతే కాదు స్వస్తికకు క్షమాపణలు చెప్పింది. 

అయితే హిట్లర్ వాడిన స్వస్తిక పదం వేల ఏంళ్ళుగా  ఇండియాలో వాడుకలో ఉంది అన్న సంగతి అక్కడి సంస్థకుతెలియదు. దాంతో ఇంత రాద్దాంతం జరిగింది.  ఈ విషయంలో ఊబెర్ పై తనకు ఎలాంటి కోపంలేదంటూ... స్వస్తిక చంద్ర చెప్పింది.

Follow Us:
Download App:
  • android
  • ios