మహేష్ కి ఎదురైన ప్రభాస్ పెద్దమ్మ... సూపర్ స్టార్ ఏం చేశాడో తెలుసా? వీడియో వైరల్
మహేష్ బాబు ఓ ప్రైవేట్ ఫంక్షన్ కి హాజరు కాగా అక్కడ ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ఎదురయ్యారు. మహేష్ రియాక్షన్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఈ వీడియో వైరల్ అవుతుంది.
ఆదివారం రాత్రి మహేష్ బాబు ఓ పెళ్లి వేడుకలో సందడి చేశాడు. కుటుంబ సమేతంగా బంధువుల కుటుంబంలో జరుగుతున్న పెళ్ళికి హాజరయ్యాడు. భార్య నమ్రత శిరోద్కర్,కూతురు సితార సైతం ఆయనతో వచ్చారు. మహేష్ బాబు సిస్టర్స్, ఇతర కుటుంబ సభ్యులు సైతం ఈ వేడుకలో పాల్గొన్నారు . కాగా ఈ వేడుకలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి మహేష్ ని కలిశారు.
కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి ని చూసిన మహేష్ బాబును ఆప్యాయంగా పలకరించారు. నమ్రత, సీతారలను పరిచయం చేశాడు. వారిద్దరినీ ప్రేమగా హత్తుకుంది శ్యామలాదేవి. మహేష్-శ్యామలాదేవి కాసేపు మాట్లాడుకున్నారు. ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవితో మహేష్ కి ఇంత అనుబంధం ఉందా... అని ఆ వీడియో చూస్తే అనిపించింది.
ప్రభాస్ ఫ్యాన్ ఒకరు ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అభిమానులం మనమే అనవసరంగా కొట్టుకుంటూ ఉంటాము. నిజానికి వాళ్లందరూ బాగానే ఉంటారు. మహేష్-ప్రభాస్ మధ్య అన్నదమ్ముల అనుబంధం ఉందని... ప్రభాస్ ఫ్యాన్ కామెంట్ పెట్టాడు. ప్రభాస్-మహేష్ ఫ్యాన్స్ మధ్య తరచుగా సోషల్ మీడియా వార్స్ చోటు చేసుకుంటూ ఉంటాయి. మా వాడు గ్రేట్ అంటే మావాడు అని కొట్టుకుంటూ ఉంటారు. అది సరికాదన్న ఉద్దేశంలో ప్రభాస్ ఫ్యాన్ ఆ కామెంట్ చేశాడు.
కృష్ణంరాజు-కృష్ణ మధ్య కూడా మంచి అనుబంధం ఉంది. వీరిద్దరూ కలిసి మల్టీస్టారర్స్ చేశారు. పలు సినిమాల్లో కలిసి నటించారు. ఇక మహేష్ సినిమాల విషయానికి వస్తే... రాజమౌళి సినిమా కోసం సిద్ధం అవుతున్నారు. లాంగ్ హెయిర్, గడ్డంతో మహేష్ కనిపిస్తుండగా ఎస్ఎస్ఎంబి 29 కోసమే అనే ప్రచారం జరుగుతుంది. ప్రభాస్ కల్కి 2829 AD , రాజా సాబ్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇవి రెండూ షూటింగ్ జరుపుకుంటున్నాయి.