Asianet News TeluguAsianet News Telugu

ఆరేళ్ల తర్వాత మళ్లీ... జగన్ వల్లే సాధ్యం...: మంత్రి వెల్లంపల్లి

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రావతరణ వేడుకలను అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తిచేసిందని దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆరేళ్ల ఆంధ్రుల కలను మళ్లీ జగన్ నెరవేర్చారని అన్నారు.  

minister vellampally srinivas praises cm ys jagan
Author
Amaravathi, First Published Oct 31, 2019, 8:56 PM IST

అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణను స్మరించుకుంటూ నవంబర్ 1వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ అవతరణ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అవతరణ వేడుకలను అధికారికంగా నిర్వహించడం ప్రతి తెలుగు బిడ్డ గర్వించాల్సిన విషయమన్నారు. 

తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణాల్నే త్యాగం చేసిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుని...అతడిని గౌరవించాలన్నారు. శుక్రవారం రాష్ట్ర అవతరణ దినోత్సవాలను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి తన తరఫున, మొత్తంగా వైశ్య సమాజం తరఫున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని వెల్లంపల్లి తెలిపారు.

read more ఆంధ్ర ప్రదేశ్ అవతరణ వేడుకలకు సర్వం సిద్దం... ప్రభుత్వ కార్యక్రమాలివే

1952 డిసెంబరు 15న ఏకంగా 58 రోజుల నిరాహార దీక్ష తర్వాత శ్రీరాములు అమరులయ్యారని గుర్తుచేశారు. ఆ అమరజీవిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని అన్నారు. ఆయన ఆత్మార్పణ తర్వాత..  1953 అక్టోబరు 1న ఒక రాష్ట్రంగా ఏర్పడినా, ఆంధ్రప్రదేశ్ గా 1956 నవంబరు 1న భాషాప్రయుక్త రాష్ట్రంగా అవతరించిందని వివరించారు. కాబట్టి నవంబరు 1ని రాష్ట్ర అవతరణ దినోత్సవంగా ఏటా జరుపుతామని  సీఎం ఏనాడో మాట ఇచ్చారని....ఆ మాటను ఇప్పుడు నిలబెట్టుకున్నారని అన్నారు.

ఆరేళ్ళ తర్వాత మళ్ళీ తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషధాయకమని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉత్సవాలను మన చరిత్రకు, మహనీయుల త్యాగాలకు నిదర్శనంగా జరుపుకోవాలని ప్రజలకు మంత్రి వెల్లంపల్లి విజ్ఞప్తి చేస్తున్నాను.

read more  విశాఖ భూకుంభకోణంపై చంద్రబాబు సిట్...అందులో ఏముందంటే...: విజయసాయి రెడ్డి

Follow Us:
Download App:
  • android
  • ios