Asianet News TeluguAsianet News Telugu

'మజిలీ' టాక్: ఇంట్రవెల్ ముందు సమంత.. క్లైమాక్స్ లో

అక్కినేని నాగచైతన్య, సమంత, దివ్యాన్ష కౌశిక్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘మజిలీ’. క్రికెట్, ప్రేమ, పెళ్లి ఈ విషయాలు చుట్టూ  సాగే  రొమాంటిక్, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా.

Naga Chaitanya's Majili movie film Nagar talk
Author
Hyderabad, First Published Apr 4, 2019, 9:39 AM IST

అక్కినేని నాగచైతన్య, సమంత, దివ్యాన్ష కౌశిక్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘మజిలీ’. క్రికెట్, ప్రేమ, పెళ్లి ఈ విషయాలు చుట్టూ  సాగే  రొమాంటిక్, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా.  ఇప్పటికే రిలీజైన ట్రైలర్, పోస్టర్స్..మజిలీ మొదటిరోజే  చూసి తీరాలి!! అన్న ఇంప్రెష‌న్ ని ఇవ్వ‌డంలో  స‌క్సెస్ అయ్యాయి. 

దానికి తోడు వెధ‌వ‌ల‌కే మంచి పెళ్లాలు దొరుకుతారు! అన్న డైలాగ్ ని ప్ర‌తిబింబించేలానే త‌న పాత్ర ఉంటుంద‌ని చైతూ నేటి ఇంట‌ర్వ్యూలోనూ చెప్పటం సినిమాపై ఇంట్రస్ట్ ని మరో మెట్టు పైకి తీసుకెళ్లింది.  రేపు అనగా ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోన్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ నేపధ్యంలో ఇప్పటికే ఫిల్మ్ సర్కిల్స్ లో  ఈ చిత్రం టాక్ వినపడుతోంది.

ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ...ఈ సినిమా ఫస్టాఫ్  నాగ‌చైత‌న్య – దివ్యాన్షు కౌశిక్ లవ్ స్టోరీ చుట్టూ కథ తిరుగుతుంది.  ఇంట‌ర్వెల్ ముందు సమంత పాత్ర సీన్ లోకి వస్తుంది. అక్కడ నుంచి కథ ఊపు అందుకుంటుంది. 

దాంతో సెకండాఫ్ మొత్తం స‌మంత చుట్టూ కథ తిరుగుతుంది. అక్కడ నుంచి స్క్రీన్ ని సమంత స్క్రీన్ ని గ్రాబ్ చేసేస్తుంది.  చైతు భార్య‌గా సామ్ పెర్ఫామెన్స్ సినిమాలో ఎమోష‌న్ సీన్ సీన్ కు పెంచుకుంటూ పోతుంది.  చైతు- సామ్ ఒక‌రితో ఒక‌రు పోటీప‌డుతూ న‌టించటం ముచ్చటేస్తుంది. సినిమా ప్రీ క్లైమాక్స్ లో అంటే దాదాపు  సినిమా శుభం పడటానికి అరగంట ముందు ఎమోష‌న్ సీన్స్ పీక్స్ కు వెళ్తాయి.

థ‌మ‌న్ రీరికార్డింగ్ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది.ఇక క్లైమాక్స్ చూసిన తరవాత ప్రతి ఒక్కరూ థియేటర్ నుంచి బరువెక్కిన గుండెలతో బయటికి వస్తారని  చెప్తున్నారు. ఇక ఆల్రెడీ పెళ్లైన మగాళ్లు అయితే తమ భార్యల గురించే ఆలోచిస్తూ థియేటర్ నుంచి బయటికి వస్తారని చెప్తున్నారు. 

ఈ సినిమాకు నిన్ను కోరి దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. గోపీ సుందర్ సంగీతం సమకూర్చిన సంగీతం సినిమాకు ఎమోషనల్ కనెక్టివిటిని సెట్ చేస్తోంది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు.

Follow Us:
Download App:
  • android
  • ios