Asianet News TeluguAsianet News Telugu

ఎట్టకేలకు ఆ కల నెరవేర్చుకున్న కార్తీక దీపం డాక్టర్ బాబు.. ఫ్యాన్స్ శుభాకాంక్షలు!

కార్తీక దీపం ఫేమ్ నిరుపమ్ పరిటాల ఫ్యాన్స్ తో ఒక గుడ్ న్యూస్ పంచుకున్నారు. దాంతో సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 

karthika deepam fame nirupam paritala owns a house performs housewarming ceremony ksr
Author
First Published Apr 18, 2024, 5:55 PM IST

నిరుపమ్ పరిటాల అలియాస్ కార్తీక్ అలియాస్ డాక్టర్ బాబు. బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. పలు సీరియల్స్ నటించినప్పటికీ నిరుపమ్ కి కార్తీక దీపం విపరీతమైన ఇమేజ్ తెచ్చిపెట్టింది. దీప అలియాస్ వంటలక్క భర్త పాత్రలో ఆయన ప్రేక్షకులను మెప్పించాడు దాదాపు ఏడేళ్లు సాగిన కార్తీక దీపం సీరియల్ 2023 జనవరిలో ముగిసింది. కాగా ఇటీవల కార్తీక దీపం 2 తిరిగి మొదలైంది. కార్తీక దీపం నవవసంతం పేరుతో పార్ట్ 2 స్టార్ మా లో ప్రసారం అవుతుంది. 

దీప పాత్ర చేసిన ప్రేమీ విశ్వనాథ్ మరోసారి నిరుపమ్ పరిటాలతో నటిస్తుంది. ఊహించిన విధంగానే కార్తీక దీపం 2 భారీ ఆదరణ రాబడుతుంది. ఇదిలా ఉంటే నిరుపమ్ సొంతింటి కల సాకారం చేసుకున్నాడు. ఆయన కొత్తగా నిర్మించుకున్న ఇంట్లో అడుగుపెట్టాడు. గృహప్రవేశ ఫోటోలు నిరుపమ్ భార్య మంజుల తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. 

శ్రీరామ నవమి జన్మదినాన మంజుల-నిరుపమ్ నూతన గృహప్రవేశం చేశారు. దీంతో నిరుపమ్-మంజుల అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మీరు మరింతగా ఎదగాలని కామెంట్స్ చేస్తున్నారు. నిరుపమ్-మంజుల కొన్ని సీరియల్స్ లో నటించారు. వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మరోవైపు నిరుపమ్ బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్ట్ చేస్తాడనే వాదనలు వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా వెళ్లాలని లేదు. ఛాన్స్ వస్తే ఆలోచిస్తా అని నిరుపమ్ అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios