Asianet News TeluguAsianet News Telugu

పుష్ప పుష్ప సాంగ్ ఫుల్ లిరిక్స్... అల్లు అర్జున్ క్యారెక్టర్ కి చంద్రబోస్ ఎలివేషన్!

పుష్ప 2 నుండి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది. పుష్పరాజ్ క్యారెక్టర్ ఎలివేట్ చేసేలా చంద్రబోస్ లిరిక్స్ ఉన్నాయి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోసం పుష్ప పుష్ప పుష్ప... ఫుల్ లిరిక్స్ 
 

allu arjun starer pushpa 2 song pushpa pushpa full song lyrics ksr
Author
First Published May 1, 2024, 6:58 PM IST

పుష్ప సక్సెస్ కి ప్రధాన కారణం... దర్శకుడు సుకుమార్ అల్లు అర్జున్ క్యారెక్టర్ ని తీర్చిదిద్దిన తీరు. కూలోడైనా కానీ టన్నుల కొద్దీ ఆత్మాభిమానం ఉన్న కుర్రాడిగా పుష్ప నేచర్ ఉంటుంది. ఆ అత్మభిమానం, పొగరే ఎర్రచందనం కూలీ నుండి మాఫియా డాన్ గా ఎదిగేలా చేస్తుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ సామ్రాజ్యానికి కింగ్ అయిన పుష్ప రాజ్ యాటిట్యూడ్ తెలియజేసేలా 'పుష్ప పుష్ప పుష్ప' సాంగ్ ఉంది. చంద్రబోస్ మాస్ లిరిక్స్ అల్లు అర్జున్ క్యారెక్టర్ ని ఎలివేట్ చేశాయి. దేవిశ్రీ ట్యూన్స్ మెస్మరైజ్ చేశాయి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కోసం 'పుష్ప పుష్ప పుష్ప' సాంగ్ ఫుల్ లిరిక్స్ 

నువ్వు గ‌డ్డం అట్టా స‌వ‌రిస్తుంటే దేశం ద‌ద్ద‌రిల్లే
నువ్వు భుజ‌మే ఎత్తి న‌డిసోస్తుంటే భూమే బ‌ద్ద‌ల‌య్యే
నువ్వు నిలవాలంటేఆకాశం ఎత్తే పేంచాలే
నిను కొల‌వాలంటే సముద్రం ఇంకా  లొతే త‌వ్వాలే

గువ్వ పిట్ట‌లాగ వాన‌కి త‌డిసి బిక్కుమంటూ రెక్క‌లు ముడిచి 
వ‌ణుకుతు వుంటే నీదే త‌ప్ప‌వ‌దా..పెద్ద గ‌ద్ద లాగా మ‌బ్బుల‌పైన హ‌ద్దు దాటి ఎగిరావంటే 
వ‌ర్ష‌మైనా త‌ల‌నే వంచి కాళ్ళ కింద కురుసైదా..

ఎన్నో వ‌చ్చిన పుష్ఫ కి పాపం కొన్ని రావంట‌..
వ‌ణుకే రాదు..
వొట‌మి రాదు..
వెన‌క‌డుగు
ఆగ‌డ‌ము..
అస‌లు రానే రాదు 
అన్ని వున్న పుష్ప కి పాప‌మ్ పుణ్యం లేవంట‌..
భ‌య‌మే లేదు..బెంగే లేదు..బెదురు ఎదురు తిరిగే లేదు.త‌గ్గేదే లేదు...
ద‌ణ్ణ‌మెడితే దేవుడికే.. స‌లామ్ కొడితే గురువుల‌కే.. కాళ్ళు మెక్కితే అమ్మ‌కేరా..

త‌ల‌దించినావా భానిస‌వి..ఎత్తినావా బాదుషావి..
త‌ల పోగ‌రే నీ కిరీట‌మైతే  భూత‌ల‌మంతా నీదేరా..

ఆడు కాలుమీద కాలేసి కూసున్నాడంటే..బండ రాయి కూడా బంగారు సింహ‌స‌నమ‌ట‌

వేరే సింహ‌స‌నం ఏదైనా వ‌ట్టి బండ‌రాయంట‌..

ద‌ణ్ణ‌మెడితే దేవుడికే.. స‌లామ్ కొడితే గురువుల‌కే.. కాళ్ళు మెక్కితే అమ్మ‌కేరా..


వాడు నీకు గొప్పేంకాదు.. వీడు  నీకు ఎక్కువ‌కాదు.. నీకు నువ్వే బాసులా వుండు..

ఎవ‌డో విలువ ఇచ్చేదేంది..ఎవ‌డొ నిన్ను గుర్తించేదేంది..

వొంటి నిండా తిమ్మోర వుంటే నీ పేరే నీ బ్రాండు..

అస్స‌లు తగ్గేదే లే

పుష్ప 2 ఆగస్టు 15న విడుదల కానుంది. అల్లు అర్జున్ కి జంటగా రష్మిక మందాన నటిస్తుంది. ఫహద్ ఫాజిల్ మెయిన్ విలన్ రోల్ చేస్తున్నారు. సునీల్, రావు రమేష్, అనసూయ కీలక రోల్స్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios