Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ 8 ఫస్ట్ కంటెస్టెంట్ ఫిక్స్? బుల్లితెర ప్రేక్షకులకు పండగే!

బిగ్ బాస్ సీజన్ 7కి ఏర్పాట్లు మొదలయ్యాయని తెలుస్తుండగా... ఓ టాప్ సెలెబ్ కంటెస్ట్ చేయనున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. ఆ కంటెస్టెంట్ ఎవరో చూద్దాం
 

karthika deepam fame nirupam paritala might contest in bigg boss telugu 8 ksr
Author
First Published Apr 12, 2024, 7:31 PM IST

బిగ్ బాస్ సీజన్ 7 ట్రెమండస్ సక్సెస్ అయ్యింది. రికార్డు టీఆర్పీ రాబట్టింది. నాగార్జున సారథ్యంలో షో విజయతీరాలకు చేరింది. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడు. సీరియల్ నటుడు అమర్ దీప్ రన్నర్ గా నిలిచాడు. సీజన్ 7 సక్సెస్ నేపథ్యంలో సీజన్ 8 వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తేవాలి అనుకుంటున్నారట. బిగ్ బాస్ తెలుగు 8 కి రంగం సిద్ధం అవుతుందన్న వార్త షేక్ చేస్తుంది. బిగ్ బాస్ లవర్స్ పండగ చేసుకుంటున్నారు. 

కాగా కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ కూడా మొదలైందట. సీజన్ 7 సక్సెస్ ని కంటిన్యూ చేసేలా టాప్ సెలెబ్స్ ని హౌస్లోకి పంపాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ క్రమంలో ప్రముఖులను సంప్రదిస్తున్నారట. మొదటి కంటెస్టెంట్ ఎంపిక ప్రక్రియ పూర్తి అయ్యిందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. దాని ప్రకారం కార్తీక దీపం ఫేమ్ నిరుపమ్ పరిటాల బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టనున్నాడట. 

karthika deepam fame nirupam paritala might contest in bigg boss telugu 8 ksr

కార్తీక దీపం సీరియల్ లో కార్తీక్ అలియాస్ డాక్టర్ బాబుగా నిరుపమ్ పరిటాల చాలా ఫేమస్. నిరుపమ్ కొన్ని సినిమాల్లో కూడా నటించాడు. అయితే కార్తీక దీపం అతనికి భారీ ఇమేజ్ తెచ్చిపెట్టింది. మరి నిరుపమ్ కి బుల్లితెర ప్రేక్షకుల్లో ఉన్న ఇమేజ్ రీత్యా అది షోకి ప్లస్ అవుతుంది. నిరుపమ్ పచ్చ జెండా ఊపిన నేపథ్యంలో అతని ఎంపిక పూర్తి అయ్యిందని అంటున్నారు. 

అయితే ఈ వార్తలో నిజం ఉండకపోవచ్చని కొందరి వాదన. కారణం... ఇటీవలే కార్తీక దీపం 2 ప్రారంభం అయ్యింది. మొదటి వారమే టీఆర్పీ దుమ్ము రేపింది. కార్తీక దీపం సీరియల్ లో వంటలక్క, డాక్టర్ బాబు లేకుంటే ప్రేక్షకులు హర్షించరు. కార్తీక దీపం పార్ట్ 1లో ఈ రెండు పాత్రలను చంపేశాక టీఆర్పీ భారీగా పడిపోయింది. దాంతో కథలో మలుపు తిప్పి వారు బ్రతికే ఉన్నట్లు చూపించారు. కార్తీక దీపం 2 ఇప్పుడిప్పుడే జనాల్లోకి వెళుతుండగా నిరుపమ్ ని బిగ్ బాస్ షోకి పంపే ఆలోచన స్టార్ మా చేయదు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios