Asianet News TeluguAsianet News Telugu

సూపర్ యోధుడిగా తేజ సజ్జా... మిరాయ్ టీజర్ చూశారా?

తేజ సజ్జా హనుమాన్ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ చిత్ర ప్రభంజనం ముగియక ముందే మరో క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటించాడు. 
 

hero teja sajja starer mirai teaser out now ksr
Author
First Published Apr 18, 2024, 3:34 PM IST

2024ని ఘనంగా ఆరంభించాడు తేజ సజ్జా. ఆయన సంక్రాంతి చిత్రం హనుమాన్ బ్లాక్ బస్టర్ కొట్టింది. హనుమాన్ వరల్డ్ వైడ్ రూ. 350 కోట్ల వసూళ్లు రాబట్టింది. దర్శకుడు ప్రశాంత్ వర్మ సోషియో ఫాంటసీ అంశాలతో సూపర్ హీరో మూవీగా తెరకెక్కించాడు. తేజ సజ్జాకు భారీ ఇమేజ్ తెచ్చిపెట్టింది హనుమాన్. హనుమాన్ మూవీకి సీక్వెల్ ఉంటుందని ప్రశాంత్ వర్మ ఇప్పటికే చెప్పాడు. అయితే హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ లో హీరోగా స్టార్ నటిస్తాడని ఆయన చెప్పడం విశేషం. 

ప్రస్తుతం హనుమాన్ ఓటీటీలో సందడి చేస్తుంది. కాగా నేడు మరో భారీ ప్రాజెక్ట్ ప్రకటించాడు తేజ సజ్జా. హనుమాన్ మూవీలో సూపర్ హీరోగా నటించిన తేజ సజ్జా... ఈసారి యోధుడిగా మెస్మరైజ్ చేయనున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా నటిస్తున్న చిత్రానికి మిరాయ్ అనే టైటిల్ నిర్ణయించారు. సూపర్ యోధ అనే ట్యాగ్ లైన్ జత చేశారు. 

 

మిరాయ్ టైటిల్ అండ్ కాన్సెప్ట్ టీజర్ అద్భుతంగా ఉంది. అపార జ్ఞానం ఇచ్చే తొమ్మిది గ్రంధాలను రక్షించే యోధుడిగా తేజ సజ్జా పాత్ర ఉంది. ఆయన లుక్ ఆకట్టుకుంది. ఇక యాక్షన్ ఎపిసోడ్స్ ఈ చిత్రానికి హైలెట్ కావడం ఖాయంగా కనిపిస్తుంది. విజువల్స్ విస్మయపరిచే విధంగా ఉన్నాయి. ఉన్నత నిర్మాణ విలువలతో పాన్ ఇండియా మూవీగా విడుదల చేయన్నారు. 

మిరాయ్ మూవీ విడుదల తేదీ సైతం ప్రకటించారు. 2025 ఏప్రిల్ 18న విడుదల కానుంది. సూర్య వర్సెస్ సూర్య చిత్రంతో దర్శకుడిగా మారిన కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్నాడు. హీరో రవితేజతో ఆయన ఈగిల్ మూవీ చేసిన సంగతి తెలిసిందే. ఇక మిరాయ్ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ప్యాక్టరీ బ్యానర్ లో టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios