Asianet News TeluguAsianet News Telugu

అట్లీకి #Alluarjun ఆ రేంజిలో షాక్ ఇచ్చాడా ?

పుష్ప 2 మూవీ తర్వాత అల్లు అర్జున్.. తమిళ దర్శకుడు అట్లీతో సినిమా చేయడం దాదాపు ఖాయమనే వార్తలు వచ్చాయి.  

Allu Arjun wanted Atlee to work on a new idea and narrate it to him jsp
Author
First Published Mar 24, 2024, 6:50 AM IST


 అల్లు అర్జున్... పుష్ప 2 మూవీ తర్వాత వెంటనే  ఏ సినిమా చెయ్యబోతున్నారనే టాపిక్ గత కొంతకాలంగా నడుస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఆయనతో సినిమా చేయాలని స్క్రిప్టు లు రెడీ చేసుకుంటున్న దర్శకులు, ప్రొడక్షన్ హౌస్ లు వరరకట్టి క్యూలో ఉన్నాయి. త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగ, బోయపాటి శ్రీను, అట్లీ, సురేంద్ రెడ్డి వంటి దర్శకులతో ఈయన సినిమాలు చేయటానికి సరంజామా సిద్దం చేసుకుంటున్నారు. అయితే పుష్ప 2 మూవీ తర్వాత అల్లు అర్జున్.. తమిళ దర్శకుడు అట్లీతో సినిమా చేయడం దాదాపు ఖాయమనే వార్తలు వచ్చాయి.  

 అట్లీ గతేడాది షారుఖ్‌ ఖాన్‌తో చేసిన 'జవాన్' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇపుడు తొలిసారి అల్లు అర్జున్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అట్లీ.  ఈ సినిమాను అల్లు అర్జున్ పుట్టినరోజైన ఏప్రిల్ 8న అఫీషియల్‌గా ప్రకటించే అవకాశాలున్నాయి అని ప్రచారం జరుగుతోంది. అలాగే  ఈ సినిమా కూడా ప్యాన్ ఇండియా లెవల్లో భారీ యాక్షన్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారని చెప్తున్నారు. అయితే రీసెంట్ గా అట్లీ ఓ స్క్రిప్టు పూర్తి చేసి అల్లు అర్జున్ కు నేరేట్ చేసారట. ఆ స్క్రిప్టు కాస్త పాత వాసనలతో ఉందని, హీరో ఎలివేషన్స్ , యాక్షన్ ఎపిసోడ్స్ కు ప్లేస్ మెంట్స్ బాగున్నా స్టోరీలైన్ మరీ ఎనభైల కాలంనాటిదిలా ఉందనిపించటంతో బన్నీ ఆ కథ వద్దని వేరేది చేద్దామని చెప్పారట. మంచి ఫామ్ లో ఉన్న అట్లీ అసలు ఇలాంటి మాట ఊహించలేదట. 

వెంటనే స్క్రిప్టు ఓకే అయ్యి మిగతా పనులు ప్రారంభం అవుతాయనే ఉత్సాహంలో ఉన్నారట. అయితే బన్ని ఇచ్చిన షాక్ తో ఇప్పుడు మరో స్టోరీ లైన్ మీద తన టీమ్ తో కూర్చుంటున్నారని తమిళ సినిమా వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఇందులో ఎంతవరకూ నిజం అనేది తెలియాల్సి ఉంది. ఈ సారి కూడా బన్నిని ఇంప్రెస్ చేయలేకపోతే మొహమాటం లేకపోతే వేరే దర్శకుడుతో ముందుకు వెళ్లే అవకాసం ఉందని తెలుస్తోంది. పుష్ప వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత తను చేసే సినిమాపై ఖచ్చితంగా ఓ రేంజిలో ఎక్సపెక్టేషన్స్ ఉంటాయని వాటిని రీచ్ కావాలని బన్ని భావించే ఈ డెసిషన్ తీసుకుని కథల విషయంలో ఆచి,తూచి అడుగులు వేస్తున్నారట. 
   
మరో ప్రక్క  దర్శకుడు బోయపాటి శ్రీను, అల్లు అర్జున్‌తో కాంబినేషన్‌లో ఓ ప్రాజెక్టు ప్రతిపాదన కూడా ఉంది. గీతా ఆర్ట్స్ ఇటీవల బోయపాటి శ్రీనుతో “భారీ” చిత్రాన్ని ప్రకటించింది కానీ హీరో పేరును వెల్లడించలేదు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ నటిస్తాడని రూమర్స్ ఉన్నప్పటికీ, ‘ఐకాన్ స్టార్’ చివరి నిమిషంలో తన ప్లాన్స్ మార్చుకుంటాడు కాబట్టి మనం ఖచ్చితంగా చెప్పలేమంటున్నారు.  ఆ ప్రాజెక్టు తమిళ దర్శకుడు సూర్యతో బోయపాటి చేయబోయే సినిమా గురించి అంటున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios