డయాబెటిస్ ఉన్నవారు లవంగాలు తింటే ఏమౌతుందో తెలుసా?
లవంగాలు ఒక మసాలా దినుసు. ఇవి ఫుడ్ రుచిని పెంచడంతో పాటుగా మన ఆరోగ్యానికి కూడా ఎంతగానో మేలు చేస్తాయి. ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్లు వీటిని తింటే ఎన్నో లాభాలను పొందుతారు. అవేంటంటే?
ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఉండే మసాలా దినుసుల్లో లవంగాలు ఒకటి. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్న లవంగాలు డయాబెటీస్ పేషెంట్లకు దివ్య ఔషధంలా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ మసాలా దినుసు లవంగాల్లో ఉండే పోషకాలు జీవక్రియ సమస్యలను తగ్గిస్తాయి. అలాగే మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీంతో మన శరీరం ఎన్నో రోగాలకు దూరంగా ఉంటుంది. మరి మధుమేహులు లవంగాలను తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
లవంగాల పోషకాలు
లవంగాల్లో ఫైబర్, కాల్షియం, మాంగనీస్, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఎంతగానో సహాయపడతాయి. ఇది మన శరీరానికి అవసరమైన శక్తిని అందించడానికి కూడా సహాయపడతాయి.
మధుమేహ వ్యాధిగ్రస్తులకు లవంగాలు
లవంగాలు డయాబెటీస్ పేషెంట్ల శరీరంలో ఇన్సులిన్ సున్నితత్వాన్ని ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. మధుమేహులు లవంగాలను ఇన్సులిన్ హార్మోన్లు, జీవక్రియ, శక్తిని ప్రేరేపించడానికి రోజూ లవంగాలను తినొచ్చు. సాధారణంగా డయాబెటిస్ ఉన్నవారు ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచడానికి లవంగాలు తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది.
గుండె జబ్బులను తగ్గిస్తుంది
లవంగాలను ఆహారంలో తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. రోజుకు కనీసం 1.5 గ్రాముల లవంగాలు తింటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
వైరల్ ఇన్ఫెక్షన్లు నయం
ఇన్ఫ్లుఎంజా, డెంగ్యూ దోమల ద్వారా వ్యాపించే వైరల్ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించడంలో లవంగాలు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఈ లవంగాలను తింటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
జీర్ణక్రియను క్రమబద్ధీకరిస్తుంది
లవంగాలు కడుపు రుగ్మతలు, వాంతులు, వికారం వంటి జీర్ణ సమస్యలను నయం చేయడానికి కూడా సహాయపడతాయి. మన ఇళ్లలో మనం వండే చాలా వంటకాల్లో లవంగాలను చేర్చడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణమే.