నారా రోహిత్ చిత్రం రిలీజ్ కు ఎన్నికల కోడ్ అడ్డం వస్తుందా?
మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా సినిమా టీజర్ విడుదల కానుంది.
బాణం సినిమాతో వెండితెరకు పరిచయమైన నారారోహిత్ (Rohith Nara)ఆ తర్వాత చాలా కాలం సరైన సినిమా పడలేదు. ఆ తర్వాత చేసిన సోలో, ప్రతినిధి సినిమాలు బాగా వర్కవుట్ అయ్యాయి. వీర భోగ వసంత రాయలు సినిమాలో కనిపించిన నారా రోహిత్ దాదాపు ఐదేళ్లు పాటు గ్యాప్ తీసుకున్నారు. మళ్లీ ఇన్నేళ్ళ తర్వాత ప్రతినిధి 2 (Prathinidhi 2)తో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలే క్రియేట్ అయ్యాయి.
మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా రోజులకు ప్రతినిధి 2 టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా 'ప్రతినిధి 2' టీజర్ విడుదల చేయనున్నారు. శుక్రవారం ఉదయం సోషల్ మీడియాలో టీజర్ విడుదల చేయడడంతో పాటు చిత్ర బృందానికి చిరు తన శుభాకాంక్షలు తెలియజేస్తారు.అయితే ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేయటంతో ఈ సినిమా ఎన్నికల సమయంలో వస్తుందా అనే సందేహం మొదలైంది.
పొలిటికల్ కంటెంట్ ఉన్న సినిమా కావటంతో ఎలక్షన్ సమయంలో రిలీజ్ ఇబ్బంది అవుతుంది అంటున్నారు. అయితే థియేటర్ రిలీజ్ కాకుండా ఏ ఓటిటిలో అయినా రిలీజ్ చేసే అవకాసం ఉంది అని కొందరు అంటున్నారు. ఒక్క పాట మినహా 'ప్రతినిధి 2' చిత్రీకరణ అంతా పూర్తి అయ్యిందని తెలిసింది. త్వరలో హైదరాబాద్ సిటీలో ఆ సాంగ్ షూట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ మూడో వారం సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ప్లాన్ చేస్తున్నారు. త్వరలో విడుదల తేదీ అనౌన్స్ చేయనున్నారు.
'ప్రతినిధి 2' చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ తనయుడు, యువ సంగీత సంచలనం మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి కూర్పు: రవితేజ గిరిజాల, కళా దర్శకత్వం: కిరణ్ కుమార్ మన్నె, స్టంట్స్: శివరాజు, ఛాయాగ్రహణం: నాని చమిడిశెట్టి, నిర్మాణ సంస్థ: వానర ఎంటర్‌టైన్‌మెంట్స్, నిర్మాతలు: కుమార్ రాజా బత్తుల - ఆంజనేయులు శ్రీ తోట - కొండకళ్ల రాజేందర్ రెడ్డి, దర్శకత్వం: మూర్తి దేవగుప్తపు.