Asianet News TeluguAsianet News Telugu

ముగ్గురు మోన‌గాళ్లు.. టీ20 వరల్డ్ కప్ 2024 భారత జట్టులో వీరు ఉండాల్సిందే.. !

T20 World Cup 2024 : ఐపీఎల్ 2024 సీజ‌న్ జ‌రుగుతుండగానే టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 కోసం భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించ‌డానికి బీసీసీఐ సిద్ధ‌మ‌వుతోంది. ఐపీఎల్ అంశాల‌ను కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోనున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు యంగ్ ప్లేయ‌ర్లు దుమ్మురేపుతున్నారు. 
 

Shivam Dubey, Mayank Yadav, Rinku Singh should be in India's T20 World Cup 2024 team RMA
Author
First Published Apr 10, 2024, 11:13 PM IST

T20 World Cup 2024 : ఐపీఎల్ హంగామా కొన‌సాగుతోంది. ఈ టోర్నీ ముగిసిన వెంట‌నే మ‌రో మెగ టోర్నీ ప్రారంభం కానుంది. అదే ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024. ఈ క్రికెట్ టోర్నీ కోసం క్రికెట్ ఆడే దేశాలు త‌మ జ‌ట్ల‌ను ప్ర‌క‌టించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాయి. భార‌త్ కూడా ఏప్రిల్ నెలాఖ‌రున, లేదా మే తొలి వారంలో టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024 కోసం జ‌ట్టును ప్ర‌క‌టించ‌నుంది. అయితే, ఇప్ప‌టికే ఐపీఎల్ లో దుమ్మురేపుతున్న ముగ్గురు ఆట‌గాళ్లను టీమ్ లోకి తీసుకోవాల‌ని క్రికెట్ ల‌వ‌ర్స్, అభిమానుల‌ను కోరుతున్నారు. వారిలో.. 

మయాంక్ యాదవ్

భారత జట్టు తరచుగా ఫాస్ట్ బౌలర్ కోసం వెతుకుతోంది. అయితే, ఉమ్రాన్ మాలిక్ వంటి బౌలర్లు తమ పేస్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. కానీ అవి ఆశించిన స్థాయిలో లేవు. ఇప్పుడు రాత్రికి రాత్రే అందరి నోళ్లలో మెదిలింది మయాంక్ యాదవ్. కేవలం 2 మ్యాచ్‌ల్లోనే అత్యంత వేగ‌వంత‌మైన బంతులు విసిరి రికార్డుల మోత మోగించాడు. ఆరంభాన్ని అద‌ర‌గొట్ట‌లాడు. మయాంక్ యాదవ్ తన అరంగేట్రం మ్యాచ్ నుంచే రాత్రికి రాత్రే ఫేమస్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో మూడు  కీల‌క‌మైన వికెట్లు పడగొట్టాడు. మయాంక్ స్పీడ్ ముందు బ్యాట్స్ మెన్ ఇబ్బందులు ప‌డ్డారు. త‌న అద్భుత‌మైన ఇన్నింగ్స్ తో టీమ్ కు విజ‌యాన్ని అందించి వ‌రుస‌గా రెండు మ్యాచ్‌లలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. దీంతో సీనియ‌ర్ ఆట‌గాళ్లు, క్రికెట్ ల‌వ‌ర్స్ నుంచి మ‌యాంక్ యాద‌వ్ కు భార‌త టీ20 జ‌ట్టులోకి తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

 

రింకూ సింగ్

కేవలం ఒక్క ఏడాదిలోనే అభిమానుల హృదయాలను గెలుచుకున్న రింకూ సింగ్ పేరు కూడా టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 భార‌త జ‌ట్టులో ఉండాల‌ని డిమాండ్లు వ‌స్తున్నాయి. ఐపీఎల్ 2023లో అద్భుత బ్యాటింగ్‌తో ఫేమస్ అయిన రింకూ.. టీ20 ప్రపంచకప్‌కు పోటీదారుగా మారాడు. టీ20 ఫార్మాట్‌లో భారత జట్టుకు బలమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇప్పుడు రింకూ ఐపీఎల్ 2024లో కూడా ధ‌నాధ‌న్ షాట్స్ తో అద‌ర‌గొడుతున్నాడు. 

 

శివమ్ దూబే

గత సంవత్సరం శివమ్ దూబే చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నప్పుడు బ్యాట్‌తో విధ్వంసం సృష్టించి వెలుగులోకి వచ్చాడు. వ‌రుస‌గా అద్భుత‌మైన ఇన్నింగ్సులు ఆడాడు. 2019లో టీమ్ ఇండియాలో అరంగేట్రం చేసిన శివమ్ దూబే ఇప్పుడు టీ20 ప్రపంచకప్ జట్టులో ఉండాల‌నే డిమాండ్లు వ‌స్తున్నాయి. భార‌త జ‌ట్టులోకి వ‌చ్చిన త‌ర్వాత అద్భుత‌మైన ఇన్నింగ్స్ ల‌తో రాణిస్తున్నాడు. ఐపీఎల్ 2024 లోనూ దుమ్మురేపుతున్నారు. గత 4 ఇన్నింగ్స్‌ల్లో 34*, 51, 18, 45 పరుగులు చేశాడు. అతని అద్భుతమైన ప్రదర్శన సీజన్ అంతటా కొనసాగితే, సెలెక్టర్లు అతని గురించి ఖచ్చితంగా ఆలోచించవచ్చు. అయితే, దూబే బౌలింగ్‌లో అంత ప్రభావవంతంగా రాణించలేకపోయాడు.

 

ముచ్చ‌ట‌గా మూడో హాఫ్ సెంచ‌రీ.. కెప్టెన్ గా సంజూ శాంస‌న్ మ‌రో రికార్డు

Follow Us:
Download App:
  • android
  • ios