Asianet News TeluguAsianet News Telugu

RCB vs LSG Highlights Video : హోమ్‌గ్రౌండ్‌లో ఆర్సీబీకి వరుసగా రెండో ఓటమి.. నిప్పులు చెరిగిన మ‌యాంక్ యాద‌వ్

RCB vs LSG Highlights : రాయల్ ఛాలెంజర్స్ బెంగ‌ళూరు పై లక్నో ల‌క్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. ఐపీఎల్ 15వ మ్యాచ్‌లో లక్నో చేతిలో 28 పరుగుల తేడాతో బెంగ‌ళూరు టీమ్ ఓడిపోయింది.
 

RCB vs LSG Highlights: This is RCB's second consecutive defeat at home. Mayank Yadav on fire IPL 2024
Author
First Published Apr 3, 2024, 1:14 AM IST

RCB vs LSG - IPL 2024 : ఐపీఎల్ 2024లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు త‌న హోం గ్రౌండ్ లో వ‌రుస‌గా రెండో ఓట‌మిని చ‌విచూసింది. ఐపీఎల్ 17వ  సీజ‌న్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్సీబీ) వ‌ర్సెస్ ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ మ్యాచ్ చిన్నస్వామి స్టేడియంలో జ‌రిగింది. ల‌క్నో టీమ్ బెంగ‌ళూరుపై పూర్తిగా అధిప‌త్యం ప్ర‌ద‌ర్శిస్తూ బౌలింగ్, బ్యాటింగ్ లో అద‌ర‌గొట్టింది. బ్యాటింగ్ లో క్వింట‌న్ డికాక్, నికోల‌స్ పూర‌న్ ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. బౌలింగ్ విభాగంలో యంగ్ పేస‌ర్ మ‌యాంక్ యాద‌వ్ మ‌రోసారి ఆట‌గాళ్ల‌ను హ‌డ‌లెత్తించాడు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశాలున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని ఇక్కడ షేర్ చేయండి.

15వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 28 పరుగుల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)ని ఓడించింది. బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఘోర ప్ర‌ద‌ర్శ‌న చేయ‌డంలో సొంతగడ్డపై ఆ జట్టు వరుసగా రెండో ఓటమిని చవిచూసింది. మరోవైపు లక్నో జట్టు వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. 3 మ్యాచ్‌ల్లో ల‌క్నోకు  4 పాయింట్లు ఉన్నాయి. మరోవైపు ఆర్సీబీ 4 మ్యాచ్‌ల్లో ఒక‌టి గెలిచి 2 పాయింట్లు తో ఉంది. ఆ జట్టు ఇప్పటికీ తొమ్మిదో స్థానంలోనే ఉంది. చివ‌ర‌లో ముంబై ఇండియ‌న్స్ ఉంది.

ల‌క్నో బౌలింగ్ దెబ్బ‌కు ఆర్సీబీ ఆలౌట్ 

ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్ కు దిగిన లక్నో 20 ఓవర్లలో 5 వికెట్లకు 181 పరుగులు చేసింది.  అనంతరం ఆర్సీబీ జట్టు 19.4 ఓవర్లలో 153 పరుగులకే కుప్ప‌కూలింది. క్వింట‌న్ డికాక్ బ్యాటింగ్ విధ్వంసం, నికోల‌స్ పూర‌న్ హిట్టింగ్ సునామీతో బెంగ‌ళూరు బౌల‌ర్ల‌ను చెడుగుడు ఆడుకున్నారు.  మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో విధ్వంసం సృష్టించారు. డికాక్ 81 ప‌రుగులు, పూర‌న్ 40 ప‌రుగుల కీల‌క ఇన్నింగ్స్ ఆడారు.

వ‌రుస వికెట్లు.. 

182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్‌సీబీ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఏ ఒక్క ప్లేయ‌రు పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడలేదు. ఇంపాక్ట్ ప్లేయర్ మహిపాల్ లోమ్రోర్ 33 పరుగుల‌తో ఆర్సీబీ త‌ర‌ఫున టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. రజత్ పాటిదార్ 29 పరుగులు, విరాట్ కోహ్లీ 22 పరుగులు చేశారు. ఫాఫ్ డుప్లెసిస్ 19, మహ్మద్ సిరాజ్ 12, అనుజ్ రావత్ 11 పరుగులు చేశారు. 9 పరుగుల వద్ద కామెరాన్ గ్రీన్ ఔట్ కాగా, 4 పరుగుల వద్ద దినేష్ కార్తీక్ ఔటయ్యాడు. గ్లెన్ మాక్స్‌వెల్ ఖాతా కూడా తెరవలేకపోయాడు.

మయాంక్ యాద‌వ్ విధ్వంసం

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన తొలి ఐపీఎల్ మ్యాచ్‌లో 3 వికెట్లు తీసిన మయాంక్ యాదవ్ ఈ మ్యాచ్‌లోనూ త‌న బౌలింగ్ విధ్వంసం సృష్టించాడు. తన పేస్‌తో మరోసారి బ్యాట్స్‌మెన్ల‌ను హ‌డ‌లెత్తించాడు. 4 ఓవర్లలో 14 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్‌లను అవుట్ చేశాడు. నవీన్ ఉల్ హక్ 2 వికెట్లు తీశాడు. మణిమారన్‌ సిద్ధార్థ్‌, యశ్‌ ఠాకూర్‌, మార్కస్‌ స్టోయినిస్‌ ఒక్కో వికెట్ తీశారు.

పూరన్ ఉంటే పూన‌కాలే.. కొడితే స్టేడియం బ‌య‌ట‌ప‌డ్డ బాల్.. !

Follow Us:
Download App:
  • android
  • ios