Asianet News TeluguAsianet News Telugu

MI vs RCB Highlights : దండయాత్ర.. ఆర్సీబీకి చుక్క‌లు చూపిస్తూ ఇర‌గ‌దీశారు.. ముంబైకి వ‌రుస‌గా రెండో గెలుపు

MI vs RCB  Highlights : వాంఖడే స్టేడియంలో క్రికెట్ ల‌వ‌ర్స్ ప‌రుగుల వ‌ర్షంలో త‌డిసిపోయారు. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో ఇరు జట్ల ప్లేయ‌ర్లు దుమ్మురేపారు. అయితే, మొత్తంగా బెంగ‌ళూరుపై పైచేయి సాధించిన ముంబై ఐపీఎల్ 2024 లో రెండో విజ‌యాన్ని అందుకుంది. 

MI vs RCB  Highlights : Ishan Kishan, Suryakumar Yadav super innings Mumbai win over RCB, second consecutive win in IPL 2024 RMA
Author
First Published Apr 11, 2024, 11:48 PM IST

Mumbai Indians vs Royal Challengers Bangalore : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్  (ఐపీఎల్ 2024) 17వ సీజ‌న్ లో 25వ మ్యాచ్ లో ముంబై ఇండియ‌న్స్ - రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఇరు జ‌ట్ల ప్లేయ‌ర్లు ధ‌నాధ‌న్ బ్యాటింగ్ తో దుమ్మురేపాడు. అయితే, జ‌స్ప్రీత్ బుమ్రా అద్బుత‌మైన బౌలింగ్ తో ఆర్సీబీ భారీ స్కోర్ చేయ‌కుండా అడ్డుకున్నాడు. కీల‌క స‌మ‌యంలో ఐదు వికెట్లు తీసుకుని ముంబై గెలుపులో కీల‌క నాక్ తో మెరిశాడు. ఈ మ్యాచ్ లో బ్యాట‌ర్లు ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ తో వాంఖ‌డే స్టేడియంలోని అంద‌రినీ ప‌రుగుల వ‌ర్షంలో ముంచెత్తారు. వ‌రుస‌గా ఫోర్లు, సిక్స‌ర్లతో విరుచుకుప‌డ్డారు. ఆర్సీబీ ఉంచిన 196 ప‌రుగుల టార్గెట్ పై దండ‌యాత్ర చేసింది ముంబై. ఈ సీజ‌న్ లో రెండో విజ‌యాన్ని అందుకుంది.

ఈ మ్యాచ్ లో తొల‌త బ్యాటింగ్ చేసిన ఆర్సీబీకి ఆరంభం పెద్దగా క‌లిసి రాలేదు. కానీ, ఫాఫ్ డుప్లెసిస్, ర‌జ‌త్ ప‌టిదార్, దినేష్ కార్తీక్ హాఫ్ సెంచ‌రీ ఇన్నింగ్స్ తో బెంగ‌ళూరు టీమ్ 8 వికెట్లు కోల్పోయి 196 ప‌రుగులు చేసింది. విరాట్ కోహ్లీ 3 ప‌రుగుల‌కే పెవిలియ‌న్ చేరగా, మ‌రోసారి గ్లెన్ మ్యాక్స్ వెల్ సున్నాతో వెనుదిరిగాడు. ఫాఫ్ డుప్లెసిస్ 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 61 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. రజత్ పటిదర్ ఫామ్ లోకి వస్తూ సూపర్ నాక్ ఆడాడు. 25 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్ చివరలో దినేష్ కార్తీక్ అద్భుతమైన సరికొత్త షాట్స్ తో దుమ్మురేపాడు. 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. వరుస ఫోర్లు, సిక్సర్లతో అదరగొట్టాడు.

బూమ్ బూమ్ బూమ్రా.. కింగ్ ఆఫ్ ఫాస్ట్ బౌలింగ్.. ! 5 వికెట్లతో అదరగొట్టాడు..

ముంబై దండ‌యాత్ర‌.. 

197 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ కు ఆరంభం అదిరిపోయింది. క్రీజులోకి వచ్చిన ప్లేయర్లు అందరూ ధనాధన్ షాట్స్ ఆడుతూ దండయాత్ర చేశారు.  దీంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా టార్గెట్ ను చేధించింది ముంబై. ఇషాన్ కిష‌న్ దాడిని మొద‌టు పెడిడే.. సూర్య‌కుమార్ యాద‌వ్ దండ‌యాత్ర చేశాడు. హార్దిక్ పాండ్యా సిక్సుతో ఆర్సీబీకి ఓట‌మిని అందించాడు. ముంబైకి వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని అందించాడు. ఇషాన్ కిష‌న్ అద‌రిపోయే షాట్స్ తో 200ల‌కు పైగా స్ట్రైక్ రేటుతో 34 బంతుల్లోనే 69 ప‌రుగుల ఇన్నింగ్స్ ఆడాడు. త‌న ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 5 సిక్స‌ర్లు బాదాడు. రోహిత్ శ‌ర్మ 38 ప‌రుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఆ త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన సూర్య‌కుమార్ యాదవ్ దండ‌యాత్ర‌ను మొద‌లుపెట్టాడు. వ‌రుస‌గా ఫోర్లు, సిక్స‌ర్లు బాదాడు కేవ‌లం 19 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ సాధించాడు. 52 ప‌రుగుల త‌న ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 4 సిక్స‌ర్లు బాదాడు. చివ‌ర‌లో హార్దిక్ పాండ్యా 3 సిక్స‌ర్ల‌తో 21 ప‌రుగుల‌తో ముంబైకి విజ‌యాన్ని అందించాడు.

సంక్షిప్త స్కోర్లు :

బెంగళూరు : 196-8 (20 ఓవ‌ర్లు), డూప్లెసిస్ 61, ర‌జ‌త్ ప‌టిదార్ 50, దినేష్ కార్తీక్ 53*, బుమ్రా 5 వికెట్లు

ముంబై : 199-3 (15.3 ఓవ‌ర్లు), ఇషాన్ కిష‌న్ 69, రోహిత్ శ‌ర్మ 38, సూర్య‌కుమార్ యాద‌వ్ 52

డీకే దుమ్మురేపాడు.. ఏమ‌న్న బ్యాటింగ్ గా ఇది దినేష్ కార్తీక్..

Follow Us:
Download App:
  • android
  • ios