Asianet News TeluguAsianet News Telugu

ధోని సిక్స‌ర్ల సునామీ.. ఉన్నంత సేపు దుమ్మురేపాడు ! ఏం ఆట బాసు అదిరిపోయింది

MI vs CSK: ఎంఎస్ ధోనీ సిక్సర్లు వాంఖడే స్టేడియాన్ని షేక్ చేశాయి. చివ‌రి ఓవ‌ర్ లో ధోని సిక్స‌ర్ల తుఫానులో గ్రౌండ్ లోని అంద‌రూ త‌డిసిముద్ద‌య్యారు. ఈ సూపర్ ఇన్నింగ్స్ తో 'ధోని ధోని.. ' అంటూ గ్రౌండ్ హోరెత్తింది. 
 

MI vs CSK : Wankhede crowd goes berserk as vintage MS Dhoni smacks Hardik Pandya for a hat-trick of sixes IPL 2024  RMA
Author
First Published Apr 14, 2024, 10:47 PM IST

MI vs CSK - MS Dhoni : ముంబై ఇండియన్స్ ఇంట్లోకి ప్రవేశించిన ధోని సింహం గర్జించింది. వ‌చ్చిన వెంట‌నే వేట మొద‌లుపెట్టాడు. ముంబై బౌలింగ్ ను చిత్తుచేస్తూ ప‌రుగుల వ‌ర‌ద పారించాడు. వ‌రుస సిక్స‌ర్ల‌తో సునామీ సృష్టించాడు ఎంఎస్ ధోని. ధోని రాక మొద‌లుకాగానే వాంఖడే మైదానంలో ధోని ధోని అంటూ గ్రౌండ్ హోరెత్తింది. ఆడింది నాలుగు బంతులే అయినా ఉన్నంత సేపు త‌న బ్యాట్ ప‌వ‌ర్ తో దుమ్మురేపాడు. ధోని దెబ్బ‌కు బ‌లైంది ఎవ‌రో కాదు ముంబై కెప్టెన్, స్టార్ ప్లేయ‌ర్ హార్దిక్ పాండ్యా. వేసిన ప్ర‌తిబంతిని గ్రౌండ్ బ‌య‌టప‌డేలా కొట్ట‌డంతో ఏం చేయాలో తేలీక చూస్తుండిపోయాడు.. ! 

ధోని దెబ్బ‌కు ముంబై గ్రౌండ్ షేక్ 

ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ రెండో బంతికి హార్దిక్ పాండ్యా డారిల్ మిచెల్‌ను పెవిలియన్ కు పంపాడు. వికెట్ తీసి సంతోషం ఎక్కువ సేపు ఉండ‌లేదు హార్దిక్ పాండ్యాకు. మిచెల్ ఔట్ అయిన తర్వాత బ్యాట్ పట్టుకుని మైదానంలోకి ఎవరు వస్తున్నారో స్టేడియంలో సందడి నెలకొంది. అవును, అనుకున్న‌ట్టుగానే ఎంఎస్ ధోని క్రీజులోకి వ‌చ్చాడు. గ్రౌండ్ హోరెత్తుతోంది. క్రీజులోకి వచ్చిన వెంటనే ధోనీ తన బ్యాట్ ప‌వ‌ర్ చూపించ‌డం షురూ చేశాడు. హార్దిక్ వేసిన ఓవర్ మూడో బంతిని, తన ఇన్నింగ్స్ తొలి బంతిని నేరుగా బౌండరీ లైన్ దాటించాడు ధోని. మరుసటి బంతిని కూడా అదేవిధంగా సిక్స‌ర్ గా మ‌లిచాడు. 2 బంతుల్లో 12 పరుగులు వ‌చ్చాయి. మ‌రో బంతిని కూడా సిక్స‌ర్ బాదాడు.

ధోని విధ్వంసకర బ్యాటింగ్‌ను చూసి షాక్ కు గురైన హార్దిక్.. ధోని మళ్లీ ఎగిరి గంతేసిన తర్వాతి బంతికి ఫుల్‌ టాస్‌ వేశాడు. చివరి బంతికి కూడా 2 పరుగులు చేయడంలో ధోనీ విజయం సాధించాడు. మహి 500 స్ట్రైక్ రేట్‌తో ఆడుతూ 4 బంతులు మాత్రమే ఎదుర్కొని 20 పరుగులు చేశాడు. ధోనీ  బ్యాటింగ్ ధాటికి చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది.

 

 

రుతురాజ్ అద్భుత ఇన్నింగ్స్.. 

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు వచ్చిన చెన్నైకి శుభారంభం లభించకపోవడంతో 5 పరుగుల వద్ద అజింక్య రహానే ఔటయ్యాడు. రహానే పెవిలియన్‌కు చేరుకున్న తర్వాత, రచిన్ రవీంద్రతో కలిసి రుతురాజ్ గైక్వాడ్ రెండో వికెట్‌కు అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రుతురాజ్ ఒక ఎండ్ నుండి అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ 40 బంతుల్లో 69 పరుగులు చేశాడు. త‌న ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 5 సిక్స‌ర్లు బాదాడు.

 

 

KKR VS LSG HIGHLIGHTS : ఫిలిప్ సాల్ట్ తుఫానీ ఇన్నింగ్స్.. ల‌క్నో పై కోల్‌కతా సూప‌ర్ విక్ట‌రీ

Follow Us:
Download App:
  • android
  • ios