Asianet News TeluguAsianet News Telugu

స్టార్లు ఉన్నా స‌త్తాచాట‌లేక‌పోతున్నారు.. బెంగళూరుకు ఏమైంది? కోహ్లీ ఒక్క‌డైతే స‌రిపోతుందా..?

Bangalore - Delhi  IPL 2024 : ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ ప్రదర్శనలు చాలా నిరాశ‌ప‌రుస్తున్నాయి. ఇరు జట్లు ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడగా, నాలుగు మ్యాచ్‌లు ఓడిపోయాయి. బెంగళూరు టీమ్ లో విరాట్ కోహ్లీ ఒక్కడే రాణించడంతో ఇతర ఆటగాళ్లపై విమర్శలు వస్తున్నాయి. 
 

Even though there are stars, they are not successful.. What happened to Royal Challengers Bangalore? Virat Kohli IPL 2024 RMA
Author
First Published Apr 10, 2024, 6:38 PM IST

Royal Challengers Bangalore and Delhi Capitals: ఒంటిచేత్తో మ్యాచ్ ల‌ను మ‌లుపుతిప్పే స్టార్లు ఉన్నారు. ఓడిపోవ‌డం ప‌క్కా అనే మ్యాచ్ ల‌లోనూ అద్భుత‌మైన బ్యాటింగ్, బౌలింగ్ తో అద‌ర‌గొట్టి విజ‌యాలు అందించిన ఆట‌గాళ్లులు ఉన్నారు.. ఏడాది మారింది... కానీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)2024లో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)ల జాతకాలు మాత్రం మార‌డం లేదు. ఇప్ప‌టికీ ఆ జ‌ట్ల‌కు ఐపీఎల్ టైటిల్ క‌ల‌గానే మిగిలిపోయింది. ఈ సీజ‌న్ లో ఐపీఎల్ ఛాంపియ‌న్ గా నిల‌వాల‌నేది కూడా క‌ల‌గానే మిగిలిపోయేలా క‌నిపిస్తోంది.

2008 సీజన్ నుంచి ఈ రెండు జట్లు ఐపీఎల్‌లో ఆడుతున్నాయి. కానీ ఇప్పటి వరకు టైటిల్ గెలవలేకపోయాయి. ఐపీఎల్ 2024లో కూడా ఇప్పటి వరకు ఇరు జట్ల ప్రదర్శన అభిమానుల‌తో పాటు క్రికెట్ ల‌వ‌ర్స్ ను కూడా తీవ్రంగా నిరాశపరిచింది. ఆర్సీబీ ఐదు మ్యాచ్ ల‌ను ఆడింది. కేవ‌లం ఒక్క మ్యాచ్ లోనే విజ‌యం సాధించింది. దీంతో 10 జ‌ట్ల‌ పాయింట్ల ప‌ట్టిక‌లో విరాట్ కోహ్లీ టీమ్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు 9వ స్థానంలో ఉంది. క‌ప్పు గెలుస్తామంటూ టోర్నీ ముందు ఇరు జ‌ట్లు భారీ ప్ర‌క‌ట‌న‌లే చేసింది. అయితే, ముందు ఆడ‌బోయే మ్యాచ్‌ల్లోనూ ఇదే త‌ర‌హా ప్ర‌ద‌ర్శ‌న కొన‌సాగిస్తే ఐపీఎల్ టైటిల్‌పై ఆశలు మరోసారి గల్లంతవుతాయి. పాయింట్ల ప‌ట్టిక‌లో చివ‌రిస్థానంలో కోసం మాత్ర‌మే పోటీ పడ్డ జ‌ట్టుగా రికార్డును నమోదుచేస్తుంది.

గ‌లీజ్ గాళ్లు.. వాళ్ల‌తో రూం షేర్ చేసుకోవ‌డ‌మా.. రోహిత్ శ‌ర్మ కామెంట్స్ వైర‌ల్

విరాట్ కోహ్లీ ఒక్కడితే స‌రిపోదు క‌దా.. 

ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ గురించి మాట్లాడితే స్టార్ ప్లేయ‌ర కింగ్ విరాట్ కోహ్లీ మాత్ర‌మే క‌నిపిస్తున్నాడు. కోహ్లీ త‌ప్పా మ‌రెవ‌రూ వారి స్థాయికి త‌గ్గట్టుగా మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇవ్వ‌లేదు. విరాట్ కోహ్లీ చేసిన ప‌రుగుల‌తో పోలిస్తే జ‌ట్టు మొత్తం స‌భ్యులు చేసిన ప‌రుగులు దారుణంగా ఉండ‌టం గ‌మ‌నార్హం. అయితే, కింగ్ కోహ్లీ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆర్సీబీకి స్టార్ పర్ఫార్మర్‌గా ఉన్నాడు. ఐపీఎల్ 2024లో ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 316 పరుగులు చేశాడు. 146.29 స్ట్రైక్-రేట్, 105.33 స‌గ‌టుతో ప్రస్తుత సీజన్‌లో కోహ్లి రెండు అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ సాధించాడు. ఇప్ప‌టివ‌ర‌కు ఐపీఎల్ 2024లో టాప్ స్కోర‌ర్ గా ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు.

కోహ్లీపై విమ‌ర్శ‌లు త‌గునా..? 

మెరుగౌన ప్ర‌దర్శ‌న‌లు చేస్తున్నా కింగ్ కోహ్లి పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. స్ట్రైక్ రేట్ తక్కువగా ఉందనే వాదన వినిపిస్తున్నాయి. అయితే,  అయితే మిగతా ఆటగాళ్లు కలిసిరానప్పుడు ఆర్సీబీ ఎలా గెలుస్తుంద‌ని సీనియ‌ర్లు, క్రికెట్ విశ్లేష‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. బ్యాట్స్ మ‌న్ తో పాటు బౌల‌ర్లు కూడా దారుణంగా విఫ‌ల‌మ‌వుతున్నారు. తుఫాను ఇన్నింగ్స్ లు ఆడే గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఇప్పటి వరకు ఐదు ఇన్నింగ్స్‌లు ఆడి కేవ‌లం 32 పరుగులు మాత్రమే చేశాడు. కామెరాన్ గ్రీన్ ఐదు ఇన్నింగ్స్‌ల్లో 68 పరుగులు, కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ 109 పరుగులు చేశాడు. కోహ్లీ ఒక్క‌డే 316 పరుగులు చేయగా, ఈ ముగ్గురు స్టార్ బ్యాట‌ర్లు కలిసి ఇప్పటివరకు 209 పరుగులు  మాత్ర‌మే చేయ‌డం గ‌మ‌నించాల్సిన విష‌యం. 

ఆర్సీబీ కొంప ముంచుతున్న బౌల‌ర్లు.. 

ఈ సీజ‌న్ లో ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన మ్యాచ్ ల‌ను గ‌మ‌నిస్తే ఆర్సీబీ స్పిన్ బౌలింగ్ చాలా బలహీనంగా ఉంది. బెంగ‌ళూరు ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ సిరాజ్, అల్జారీ జోసెఫ్ లు సైతం చాలా నిరాశపరిచారు. సిరాజ్ నుంచి ఇలాంటి బౌలింగ్ ను ఎవ‌రూ ఊహించి ఉండరు. సిరాజ్ ఐదు మ్యాచ్‌ల్లో 10.10 ఎకానమీ రేటుతో నాలుగు వికెట్లు తీశాడు. అల్జారీ జోసెఫ్ మూడు మ్యాచ్‌లలో ఒక వికెట్ తీయగా, అతని ఎకానమీ రేటు 11.89. ఇక‌ యష్ దయాల్ ఖచ్చితంగా ఆకట్టుకున్నాడు. 8.31 ఎకానమీ రేటుతో 5 వికెట్లు తీశాడు.

స్పిన్ బౌలింగ్ ఆర్సీబీ బలహీనమైన విభాగంగా మారింది. స్పిన్నర్ మయాంక్ దాగర్ ప్రదర్శన చాలా నిరాశపరిచింది. ఐదు మ్యాచ్‌లు ఆడిన డాగర్ ఒక్క వికెట్ మాత్రమే తీసుకోగ‌లిగాడు. ఎకానమీ రేటు 10.14గా ఉండ‌టం గ‌మ‌నించాల్సిన విష‌యం. కరణ్ శర్మ ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు కానీ, చాలా ఖ‌రీదైందిగా మారింది. ఇక గ్లెన్ మాక్స్‌వెల్ ఖచ్చితంగా బంతితో కొంత మ్యాజిక్ చేసి నాలుగు వికెట్లు తీశాడు కానీ, అత‌ను ప్ర‌ధాన‌మైన బౌల‌ర్ కాదు.. బ్యాట‌ర్ గా ఆర్సీబీకి అత‌ని ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ అవ‌స‌రం.

గ‌ల్లీ గేమ్ ఆడుతున్న ఢిల్లీ.. పాయింట్ల ప‌ట్టిక‌లో చివ‌రిస్థానం కోసం పోటీ ప‌డుతోందా?

Follow Us:
Download App:
  • android
  • ios