Asianet News TeluguAsianet News Telugu

మీ ఇంట్లో ఉపయోగించే ఈ వస్తువులు ఎక్కడి నుండి వచ్చాయో తెలుసా ! ఆశ్చర్యపోతారు

పాకిస్థాన్ నుంచి మన దేశానికి చాలా రకాల వస్తువులు వస్తుంటాయి. మనం నిత్య జీవితంలో ఈ వస్తువులను ఉపయోగిస్తాం. మన ఇళ్లలో ఉపయోగించే ఈ నిత్య వస్తువులు నేరుగా పాకిస్తాన్ నుండి వస్తాయని మనలో చాలా మందికి తెలియదు.
 

These items for daily use in your home come from Pakistan! You will be surprised to know-sak
Author
First Published Mar 22, 2024, 3:16 AM IST

భారత్‌-పాకిస్థాన్‌ల మధ్య సంబంధాలు ఎంత చేదుగా ఉన్నా, మన దేశానికి పాకిస్థాన్‌ నుంచి చాలా రకాల వస్తువులు, పండ్లు ఇంకా ఎన్నో   వస్తుంటాయి. మనం నిత్య జీవితంలో ఈ వస్తువులను ఉపయోగిస్తాం. మన ఇళ్లలో ఉపయోగించే ఈ  వస్తువులు నేరుగా పాకిస్తాన్ నుండి వస్తాయని మనలో చాలా మందికి తెలియదు. అలాంటి కొన్నిటి   గురించి మీకోసం...

ఈ ఆహారాలు పాకిస్తాన్ నుండి భారతదేశానికి  

మన సాధారణ జీవితంలో చాలా బాగా ఉపయోగించబడే అనేక వస్తువులు ఇంకా పండ్లు  పాకిస్తాన్ నుండి భారతదేశానికి వస్తాయి. ఈ లిస్టులో మామిడి మొదటి స్థానంలో ఉంది. అవును, భారతదేశంలో మనం ఎంతో ఇష్టంగా తినే దాషేరి(Dasheri) ఆండ్ సింధ్రి (sindhri) మామిడిపండ్లు కేవలం పాకిస్తాన్ నుండి మాత్రమే దిగుమతి అవుతాయి. పాకిస్తాన్ ఖర్జూరాలు ఇంకా  అంతర్జాతీయ నాణ్యత గల జామపండ్లను కూడా ఎగుమతి చేస్తుంది, వీటిని మీరు తినడానికి చాలా ఇష్టపడతారు.

ఈ వస్తువులు కూడా  పాకిస్థాన్ నుంచి  

అలాగే మన ముఖ సౌందర్యాన్ని పెంచుకోవడానికి ఉపయోగించే ముల్తానీ మట్టి కూడా పాకిస్థాన్ నుంచే వస్తుంది. ఉపవాస సమయంలో మనం వాడే రాక్ సాల్ట్ పాకిస్తాన్ నుండి వచ్చిన గిఫ్ట్  అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

నిజానికి మొత్తం ఆసియా ఖండంలోని పాకిస్థాన్‌లో మాత్రమే రాక్  సాల్ట్ లభిస్తుందని మీకు తెలుసా. అలాగే ఆరోగ్యం ఇంకా మెదడును మెరుగుపరచడానికి వినియోగించే బాదం కూడా పాకిస్తాన్ నుండి మాత్రమే వస్తుంది. వాల్‌నట్‌లు అండ్ కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా పాకిస్తాన్ నుండి ఎగుమతి చేయబడతాయి. కొన్ని నూనె గింజలు ఇంకా  పండ్లు పాకిస్తాన్ నుండి కూడా వస్తాయి.

ఉన్ని(Wool ) పాకిస్తాన్ గిఫ్ట్ 

భారతదేశంలో అందమైన స్వెటర్లను తయారుచేసే ఉన్ని(Wool )  కూడా పాకిస్తాన్ నుండి వస్తుంది. మీరు ఉపయోగించే పత్తి కూడా పాకిస్తాన్ నుండి వస్తుంది. ఇలా నిత్య జీవితంలో మనం ఉపయోగించే ఎన్నో వస్తువులు ఉన్నాయి కానీ అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో మనకు తెలియదు.

Follow Us:
Download App:
  • android
  • ios