Asianet News TeluguAsianet News Telugu

భారీగా పెరిగిన బంగారం ధర..రూ.33వేలకు చేరువలో..

బంగారం ధర రోజు రోజుకీ ఆకాశాన్నంటుతోంది. వరసగా మూడురోజు బంగారం ధర పెరిగింది.

Gold prices jump today, silver rates surge
Author
Hyderabad, First Published Jan 9, 2019, 3:45 PM IST

బంగారం ధర రోజు రోజుకీ ఆకాశాన్నంటుతోంది. వరసగా మూడురోజు బంగారం ధర పెరిగింది.దీంతో.. పదిగ్రాముల బంగారం ధర రూ.33వేలకు చేరువైంది. నేటి మార్కెట్లో... 10 గ్రాముల పసిడి ధర రూ. 110 పెరిగి రూ. 32,800లకు చేరింది. పెళ్లిళ్ల సీజన్‌ దగ్గరపడుతుండటంతో స్థానిక నగల వ్యాపారుల నుంచి బంగారం కొనుగోళ్లు ఊపందుకుంటున్నాయి. దీంతో ధర పెరిగిందని మార్కెట్‌ వర్గాలు తెలిపారు. కేవలం ఈ మూడు రోజుల్లో నే బంగారం ధర రూ.300 పెరగడం గమనార్హం. 

నేటి మార్కెట్లో వెండి ధర కూడా పెరిగింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో బుధవారం ఒక్కరోజే రూ. 300 పెరిగింది. దీంతో బులియన్‌ మార్కెట్లో కేజీ వెండి ధర రూ. 40,100 పలికింది. కాగా.. అంతర్జాతీయంగా ఈ లోహల ధరలు కాస్త తగ్గాయి. న్యూయార్క్‌ మార్కెట్లో పసిడి స్వల్పంగా తగ్గి ఔన్సు ధర 1,283.10 డాలర్లుగా ఉంది. వెండి ధర కూడా 0.26శాతం తగ్గి ఔన్సు ధర 15.67డాలర్లు పలికింది.

దేశరాజధాని ఢిల్లీలో 99.9శాతం స్వచ్ఛతగల బంగారం ధర రూ.32,800గా ఉండగా.. 99.5శాతం స్వచ్ఛతగల బంగారం ధర రూ.32,700గా ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios