Asianet News TeluguAsianet News Telugu

జాలీ LLB 3..షూటింగ్ మొదలైంది, ఆపమంటూ కేసు

ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై న్యాయ వ్యవస్థ వైపు నుంచి పని చేస్తున్న ఓ ప్రముఖు లాయిర్  కేసు వేసి షాకిచ్చారు.
 

Complaint Filed Against Akshay Kumar Jolly LLB 3 Makers For Disrespecting Judicial System jsp
Author
First Published May 8, 2024, 9:20 AM IST


సినిమా  మొత్తం లా మీద, లాయర్‌ మీద వచ్చిన సినిమాలు కూడా ప్రేక్షకులకు నచ్చుతూంటాయి. బాలీవుడ్‌లో అలా వచ్చిన జాలీ ఎల్‌.ఎల్‌.బి., జాలీ ఎల్‌.ఎల్‌.బి –2 ఎంత పెద్ద హిట్ అయ్యాయో తెలిసిందే. మొదటిది 2013లో, రెండోదీ 2017లో విడుదలయ్యాయి.  ఈ రెండు సినిమాల డైరెక్టరూ ఒకరే. సుభాష్‌ కపూర్‌. కథ కూడా ఆయన రాసుకున్నదే. ఫస్ట్‌ జాలీలో అర్షద్‌ వార్సీ ఢిల్లీలో ఉండే లాయర్‌. రెండో  జాలీలో అక్షయ్‌కుమార్‌ లక్నోలో ఉండే లాయర్‌. ఇద్దరి పేర్లూ సినిమాలో ‘జాలీ’నే. మూడో జాలీకి, నాలుగో జాలీకి కూడా ప్లానింగ్‌ ఉందని ఎప్పుడు నుంచో చెప్తున్నారు. ఇప్పుడు మూడోది మొదలెట్టేసారు కూడా. అయితే ఇప్పుడు లీగల్ గా ఈ సినిమా సమస్య వచ్చి పడింది. అదేంటో చూద్దాం.

ఒక సినిమా హిట్టైందంటే ఆ సినిమాకు  వరసగా  ఫ్రాంచైజ్ గా చిత్రాలు వస్తూ ఉంటాయి.  అలాంటి చిత్రాల్లో స్టార్ హీరో అక్షయ్ కుమార్ అలాగే అర్షద్ వర్షి కాంబినేషన్ లో వచ్చిన వకీల్ సినిమా “జాలీ ఎల్ ఎల్ బి” కూడా ఒకటి.  2013 లో మొదలైన ఈ సినిమా ఈ ఫ్రాంచైజ్ ఇపుడు మూడో చిత్రానికి చేరుకుంది. అయితే ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై న్యాయ వ్యవస్థ వైపు నుంచి పని చేస్తున్న ఓ ప్రముఖు లాయిర్  కేసు వేసి షాకిచ్చారు.

 మరిన్ని వివరాల్లోకి వెళితే 2013, 2017 లో వచ్చిన రెండు సినిమాలని జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చంద్రభాన్ చూసారు. చూసిన తర్వాత వెంటనే పార్ట్ 3 షూట్ ని నిలిపివేయాలని కేసు వేసారట. అయితే తాను చూసిన ఈ రెండు సినిమాల్లో కూడా, న్యాయ వ్యవస్థ పట్ల నటీనటులకు కానీ మేకర్స్ కి కానీ ఏమాత్రం గౌరవం లేనట్టుగా అనిపించింది అని అలాగే న్యాయ వ్యవస్థతో పాటుగా తీర్పు చెప్పే న్యాయమూర్తి అన్నా కూడా ఎలాంటి గౌరవం వారికి లేదు అన్నట్టు అనిపించింది అయన ఆ కంప్లైంట్ లో పేర్కొన్నారు.

ప్రస్తుతం అయితే ఈ సినిమా ఈ కేసు లో ఇరుక్కుంది.   ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు సుభాష్ కపూర్ దర్శకత్వం వహిస్తుండగా ఫాక్స్ స్టార్ స్టూడియోస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. ఇంతకు ముందు రెండు సినిమాలకూ డబ్బులు పెట్టింది ఒకటే సంస్థ. ఇండియాలోని ఫాక్స్‌ స్టార్‌ స్డూడియోస్‌.   జాలీ ఎల్‌ఎల్‌బిని 10 కోట్లు పెట్టి తీశారు. 37 కోట్లు వచ్చింది. పెద్ద లాభం ఏం కాదు. కానీ మంచి సినిమా తీశానన్న తృప్తి సుభాష్‌కు, మంచి సినిమా చేశామన్న సంతృప్తి అర్షద్‌ వార్సీకి, మంచి సినిమా చూశామన్న సంతోషం ప్రేక్షకులకు మిగిలింది. జాలీ ఎల్‌ఎల్‌బి–2 ని 30 కోట్లు పెట్టి తీశారు. 197 కోట్లు వచ్చింది. పెద్ద లాభమే.  ఇప్పుడు కూడా మరోసారి ఈ సినిమాకు మంచి బడ్జెట్ తోనే సీక్వెల్ తీస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios