Asianet News TeluguAsianet News Telugu

కుంభరాశిపై గురుగ్రహ ప్రభావం ఎలా ఉందంటే..

వీరికి మాట విలువ పెరుగుతుంది. ఇప్పికి వరకు ఇచ్చిన వాగ్దానాలు కొన్ని నెరవేర్చగలుగుతారు. పూర్తిగా కావు. ఆ నెరవేర్చే వాగ్దానాలు కూడా కొంత ఒత్తిడి, శ్రమ అధికంగా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం ఉండదు. గుర్తింపు కొంత తక్కువే. మాట విలువ పెరుగుతుంది.

guru graha prabhavam on kumba rashi
Author
Hyderabad, First Published Dec 15, 2018, 5:00 PM IST

కుంభరాశివారికి ఈ సంవత్సరం గురువు అనుకూలం పూర్తిగా ఉండదు. కొంత ఒత్తిడి, శ్రమతో మాత్రమే ఫలితాలు సాధిస్తారు. అనుకున్నంత సులువుగా వీరు ఏ పనిని చేయలేరు.

వీరికి మాట విలువ పెరుగుతుంది. ఇప్పికి వరకు ఇచ్చిన వాగ్దానాలు కొన్ని నెరవేర్చగలుగుతారు. పూర్తిగా కావు. ఆ నెరవేర్చే వాగ్దానాలు కూడా కొంత ఒత్తిడి, శ్రమ అధికంగా ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం ఉండదు. గుర్తింపు కొంత తక్కువే. మాట విలువ పెరుగుతుంది. మాట విలువ పెరిగింది ఎవరికీ ఏహామీలు ఇవ్వకూడదు. కుటుంబంలో బాధ్యతలు నెరవేరుస్తారు. కుటుంబ గౌరవం పెరుగుతుంది. నిల్వ ధనాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తారు. స్థిరాస్తుల వైపు దృష్టి ఉంటుంది. పెట్టుబడులు విస్తరించే ఆలోచన ఉంటుంది.

స్వంత ఇంి కల నెరవేర్చుకోవాలనుకుటా ంరు. ఆలోచనలన్నీ అటువైపే ఉంటా యి. గృహ సంబంధ ఆలోచనల్లో ఒత్తిడి ఉంటుంది. సౌకర్యాలకోసం ఎదురు చూపులు ఉంటా యి. విందు వినోదాల్లో పాల్గొనాలనే ఆలోచనలు ఉంటా యి. అన్ని రకాల సౌకర్యాలు తమకు కావాలనుకుటా ంరు. ప్రయాణాల్లో ఒత్తిడి ఉంటుంది. తాము ప్రయాణించే వాహనాలు కూడా చాలా సౌకర్యంగా ఉండాలనుకుటా ంరు. జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు కొంత ఒత్తిడి ఉంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కడుపుకు సంబంధించిన లోపాలు బయటపడే అవకాశం. కడుపునొప్పి, గ్యాస్‌ ప్రాబ్లమ్స్‌, నడుస్తుంటే ఆయాసం రావడం వింవి జరుగవచ్చు.

పోటీల్లో గెలుపుకై తాపత్రయ పడతారు. శత్రువులపై విజయాన్ని ఎలా సాధించాలని వ్యూహాలు, పన్నాగాలు వేస్తూ ఉంటా రు. దానివల్ల తమ ఆరోగ్యం దెబ్బతింటుంది. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. శ్రమకుతగిన ఫలితం రాకపోవచ్చు. గుర్తింపుకోసం ఎదురుచూపులు ఉంటా యి. ఋణ సంబంధ ఆలోచనలు వ్యక్తిని ఒత్తిడికి గురి చేస్తాయి.

అధికారులతో ఒత్తిడి ఏర్పడుతుంది. ఉద్యోగం చేసే చోట జాగ్రత్తగా మెలగాలి. అన్నిరకాల సమస్యలు తమకు అవసరం లేకున్నా తమవైపు వస్తాయి. వాినుండి అధిగమించాలి. చిన్న పామునైనా పెద్ద కర్రతో క్టొటా లనే సామెతను గుర్తు తెచ్చుకోవాలి.  సంఘంలో గౌరవం పెంచుకోవాలనుకుటా ంరు. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఏ పని మొదలు ప్టిెనా అందులో ఎంతో కొంత శ్రమ, మానసిక ఒత్తిడి తప్పకుండా ఉంటా యి.

మధ్యవర్తిత్వాలు చేయకుండా ఉండాలి. కుటుంబంలో తమకు పెరిగిన గౌరవాన్ని అలాగే కాపాడుకుంటూ ఉండాలి. దానిలో మార్పు తెచ్చుకోకూడదు.

సౌకర్యాలు  అనుకూలంగా ఉండవని తెలుసుకున్నప్పుడు వాి జోలికి వెళ్ళకూడదు. ఉన్నద్లాోంనే సర్దుకునే ప్రయత్నం చేయాలి. ఆహారం సరైన సమయానికి తీసుకోవాలి. తేలికైన ఆహార పదార్థాలు తీసుకోవాలి. తొందరగా జీర్ణమయ్యే పదార్థాలు తీసుకోవాలి. వీరు వాకింగ్‌ ప్రతీరోజు తప్పనిసరిగా చేయాలి. కొంత ప్రాణాయామాలు కూడా చేయాలి. బయి పదార్థాలు కారంగా ఉండే పదార్థాలు, నూనె పదార్థాలు తీసుకోకపోవడం మంచిది.

పెద్దవారితో పోటీ పెట్టుకోకుండా ఉండాలి. పనులు పూర్తి చేసకోవడానికి ప్రయత్నం చేయాలి. శత్రువులను మిత్రులుగా మార్చుకునే ప్రయత్నం చేయాలి. రోగనిరోధకశక్తిని పెంచుకునే దిశగా ఆలోచనలు సాగాలి.

సంఘంలోగౌరవం పెంచుకోవడానికి హుందాగా ప్రవర్తించాలి. అల్లరి చిల్లర పనుల జోలికి వెళ్ళకూడదు. గౌరవాన్ని పెంచుకోవాలి.

వీరు ప్రత్యక్ష గురువులతో ఎక్కువ సమయం గడిపే ప్రయత్నం చేయాలి. దేవాలయాలకు వెళ్ళడం అక్కడ ఏదో జపాలు, పారాయణాలు చేసుకుంటూ ఉండడం మంచిది. దత్తాత్రేయ స్వామికి పూజ చేయించుకోవాలి. శనగలు, శనగపప్పు, స్వ్స్‌టీ, విద్యార్థులకు పుస్తకాలు దానంగా ఇవ్వడం మంచిది.

డా.ఎస్.ప్రతిభ

Follow Us:
Download App:
  • android
  • ios