Asianet News TeluguAsianet News Telugu

కోడెలపై దాడి: అంబటిపై కేసు, ఇళ్లకు తాళాలు వేసి...

పోలీసులు తనిఖీలు చేపట్టడంతో ఇనిమెట్ల గ్రామస్థులు తమ ఇళ్లకు తాళాలు వేసుకుని ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారు. కోడెలపై దాడి కేసులో వీడియో ఫుటేజీ ఆధారంగా నిందితుల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

Case booked against Ambati Rambabu
Author
Guntur, First Published Apr 13, 2019, 12:15 PM IST

గుంటూరు: శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద రావుపై దాడి సంఘటనలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు సహా ముగ్గురిపై కేసులు నమోదు చేశారు. పది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం ఇనిమెట్లలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. 

పోలీసులు తనిఖీలు చేపట్టడంతో ఇనిమెట్ల గ్రామస్థులు తమ ఇళ్లకు తాళాలు వేసుకుని ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నారు. కోడెలపై దాడి కేసులో వీడియో ఫుటేజీ ఆధారంగా నిందితుల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

గుంటూరు జిల్లాలోని రాజుపాలెం మండలం ఇనిమెట్ల గ్రామంలో పోలింగ్ రోజున కోడెల నేరుగా 160 నెంబర్‌ పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. గంటన్నరకు పైగా అక్కడే కూర్చొని ఉన్నారు. దీంతో కోడెలను బయటకు పంపాలంటూ ఓటర్లు ఆందోళకు దిగారు. 

ఈ సందర్భంగా కోడెల శివప్రసాద రావుపై దాడి జరిగినట్లు పోలీసులకు ఆరోపణలు అందాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. చినిగిని చొక్కాతో అలసిపోయి కోడెల శివప్రసాద రావు నడుస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో కూడా వెలుగు చూసింది. 

సంబంధిత వార్తలు

తలుపులేసుకొని బూత్‌లో ధర్నా: స్పృహ తప్పి పడిపోయిన కోడెల

కోడెలపై దాడితో నాకు సంబంధం లేదు: అంబటి

ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు ఏడు దశల్లో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓట్ల లెక్కింపు మే 23వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో 17, ఎపిలో 25 లోకసభ స్థానాలున్నాయి. దేశంలోని 543 లోకసభ స్థానాలకు ఎన్నికలకు జరుగుతున్నాయి

Follow Us:
Download App:
  • android
  • ios