Asianet News TeluguAsianet News Telugu

హోదాపై కేసీఆర్‌తో చెప్పించాలి: జగన్‌ను డిమాండ్ చేసిన బాబు

ప్రత్యేక హోదాకు తనకు అభ్యంతరం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్‌తో చెప్పించాలని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌కు  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సవాల్ విసిరారు.

chandrababu challenges to ys jagan in udayagiri meeting
Author
Udayagiri, First Published Apr 3, 2019, 4:36 PM IST


ఉదయగరి:ప్రత్యేక హోదాకు తనకు అభ్యంతరం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్‌తో చెప్పించాలని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌కు  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సవాల్ విసిరారు.

బుధవారం నాడు నెల్లూరు జిల్లా ఉదయగిరిలో నిర్వహించిన టీడీపీ ఎన్నికల సభలో చంద్రబాబునాయుడు పాల్గొన్నారు.కేసీఆర్‌తో కలిస్తే తప్పేంటని  జగన్ చెబుతున్నారని... కేసీఆర్ ప్రత్యేకహోదాకు మద్దతు ఇస్తున్నారని జగన్ చెబుతున్నారన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తమకు కూడ ఇవ్వాలని కూడ టీఆర్ఎస్ నేతలు మాట్లాడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఎన్నికల సందర్భంగా సోనియాగాంధీ ఏపీకి హామీ ఇవ్వగానే టీఆర్ఎస్ నేతలు మాట్లాడిన మాటలను బాబు గుర్తు చేశారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి తనకు అభ్యంతరం లేనది కేసీఆర్‌తో చెప్పించాలని జగన్‌ను బాబు డిమాండ్ చేశారు. ప్రతి రోజూ జగన్ లోట‌స్‌పాండ్‌కు వెళ్లి కేసీఆర్‌కు రిపోర్టు ఇస్తున్నాడని చంద్రబాబు ఎద్దేవా చేశారు. 

కేసీఆర్ ఇచ్చే కూలీకి జగన్ పనిచేస్తున్నాడని బాబు ఆరోపించారు.జగన్‌కు విశ్వసనీయత లేదన్నారు. 31 కేసులున్న జగన్ తనను విమర్శించే హక్కుందా అని ఆయన ప్రశ్నించారు. 

డబ్బులు సంపాదించుకొని వెళ్లమంటే రాజకీయాలు వ్యాపారమా అని చంద్రబాబునాయుడు అడిగారు.ఇంటర్మీడియట్ పాపైన విద్యార్థులకు కూడ నిరుద్యోగ భృతిని అమలు చేస్తామని బాబు హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అలా మాట్లాడితే జైలుకే: వైసీపీ అభ్యర్థులకు బాబు వార్నింగ్

తెలంగాణలో నాకే గౌరవం లేకుండా పోయింది: చంద్రబాబు

Follow Us:
Download App:
  • android
  • ios