Asianet News TeluguAsianet News Telugu

కి‘లేడి’.. మేకప్ తో మాయచేసి.. ముగ్గురిని వివాహమాడి.. భర్త, అత్తకు చుక్కలు చూపించి.. చివరికి ఆధార్ కార్డుతో...

తిరుపతిలో ఓ విచిత్రమైన మోసం బయపడింది. ఓ మహిళ తక్కువ వయసు ఉన్నట్టుగా మేకప్ వేసుకుని.. పెళ్లి చేసుకుని.. మోసానికి పాల్పడింది. చివరికి ఆధార్ కార్డుతో ఆమె అసలు రంగు బయటపడింది.

woman arrested for cheating 3 men in name of marriage in Tirupati
Author
Hyderabad, First Published Jul 6, 2022, 6:50 AM IST

పుత్తూరు : ఆమె ఓ మాయ లేడి. కిలాడి…. తన అందచందాలతో వల వేసింది.. మాటలతో మోసం చేస్తుంది.. అలా చేసి ఒకరి తర్వాత ఒకరు చొప్పున మొత్తం ముగ్గురిని వివాహమాడింది. చివరికి ఆధార్ కార్డు ఆమె అసలు రంగును పట్టించింది. మూడో భర్తకు అడ్డంగా దొరికిపోయింది.  దీంతో షాక్ అయిన వాళ్లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.  పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. దీంతో ఆ మాయలేడి కటకటాల పాలు అయింది. మంగళవారం తిరుపతి జిల్లా  పుత్తూరు సిఐ లక్ష్మీనారాయణ ఈ మాయ కిలేడీ వివరాలను  మీడియాకు వెల్లడించారు.

అసలేం జరిగింది? ఇంతకీ ఈ మాయ లేడి ఎలా పట్టుబడింది? ఎన్ని పెళ్లిళ్లు చేసుకుంది? ఎలా మోసం చేసింది? అనే అనుమానాలను నివృత్తి చేసే వివరాల్లోకి వెడితే..  పుత్తూరుకు చెందిన శరణ్య అనే మహిళకు అదే పట్టణంలోని రవితో వివాహం అయింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో వేర్వేరుగా ఉంటున్నారు. విడిగా ఉంటున్న క్రమంలో  శరణ్య తన పేరును సుకన్యగా మార్చుకుంది. ఈ క్రమంలోనే తమిళనాడు రాష్ట్రం వేలూరు ప్రాంతానికి చెందిన సుబ్రమణ్యం అనే వ్యక్తిని పెళ్లాడింది. అతనితో పదకొండేళ్లు కాపురం చేసింది. కరోనా  సమయంలో తల్లిని చూసేందుకు స్వగ్రామానికి వచ్చిన ఆమె మళ్లీ తిరిగి వెళ్లలేదు.

కష్టాలు తొలగిస్తానని చెప్పి బంగారం, వెండి నగలతో క్షుద్రపూజలు, ఆపై సొత్తు మాయం.. కిలాడీ లేడి లీలలు

ఈ క్రమంలో ఆర్థికంగా కష్టాలు ఎదురుకోవాల్సి వచ్చింది. దీంతో  ఏం చేయాలో అర్థం కాలేదు. తన పాత పంధానే మొదలుపెట్టాలనుకుంది. కొందరు పెళ్లిళ్ల బ్రోకర్ల తో పరిచయం పెంచుకుంది. వయసు తక్కువ కనిపించేటట్లుగా బ్యూటీ పార్లర్ లో మేకప్ వేయించుకుంది. సంధ్యగా పేరు మార్చుకుంది. ఆ తరువాత చక్కగా ఫోటోలు దిగి, ఆ ఫోటోలను వివాహ వెబ్సైట్లో పెట్టింది. తమిళనాడులో తిరువళ్లూరు జిల్లా పుదుపేటకు చెందిన ఇంద్రాణి కుమారుడు గణేష్ కు 2021లో ఓ పెళ్ళిళ్ళ బ్రోకర్ ద్వారా పరిచయమైంది.

వారు తిరువల్లూరులో వైభవంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన కొద్ది రోజులకే ఆమె భర్త, అత్తకు చుక్కలు చూపించడం మొదలు పెట్టింది. భర్త, అత్తల పేరుమీద ఉన్న ఆస్తులు తన పేరు మీదికి బదిలీ చేయాలని సంపాదన మొత్తం తన చేతిలో పెట్టాలని, బీరువా తాళాలు ఇవ్వాలని గొడవ పడుతుండేది. ఈ క్రమంలో అత్తను ఇంటి నుంచి వెళ్లగొట్టింది. ఈ వేధింపులకు అడ్డుకట్ట వేయాలని భావించిన ఆమె భర్త ఆస్తి రాసివ్వాలంటే ఆధార్ కార్డు ఇవ్వాలని కోరాడు. దీంతో ఆధార్ కార్డు వచ్చింది. అందులో కేరాఫ్ రవి అని రాసి ఉండటంతో అత్త ఇంద్రాణికి, భర్త గణేష్ కు అనుమానం వచ్చింది. దీంతో దగ్గర్లోని ఆవడి పోలీసులకు ఆమె గురించి అనుమానాలు వ్యక్త పరుస్తూ ఫిర్యాదు చేశారు. వారు రంగంలోకి దిగి కేసు దర్యాప్తు చేపట్టడంతో అన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

 

Follow Us:
Download App:
  • android
  • ios