Asianet News TeluguAsianet News Telugu

అగ్రిగోల్డ్‌ విషయంలో ఆరోపణలు: వైసీపీ నేతలకు చంద్రబాబు కౌంటర్

అగ్రిగోల్డ్ బాధితులకు వైసీపీ ప్రభుత్వం చెల్లింపుల ప్రక్రియ ప్రారంభించడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. అసలు బాధితులను ఆదుకునే ప్రక్రియను ప్రారంభించిందని చంద్రబాబు గుర్తుచేశారు

tdp chief chandrababu naidu counter attack on ysrcp leaders over agrigold assets
Author
Amaravathi, First Published Nov 7, 2019, 9:40 PM IST

అగ్రిగోల్డ్ బాధితులకు వైసీపీ ప్రభుత్వం చెల్లింపుల ప్రక్రియ ప్రారంభించడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. అసలు బాధితులను ఆదుకునే ప్రక్రియను ప్రారంభించిందని చంద్రబాబు గుర్తుచేశారు.

ఇంటి పెద్ద దిక్కు కోల్పోయిన ఒక్కో బాధిత కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున 100 కుటుంబాలకు రూ.5 కోట్లు అందజేసినట్లు తెలిపారు. అగ్రిగోల్డ్ నిందితులపై కేసులు పెట్టి.. ఆస్తులను కాపాడింది తెలుగుదేశం ప్రభుత్వమేనని చంద్రబాబు ట్వీట్ చేశారు.

అగ్రిగోల్డ్ బాధితుల జాబితా సేకరించి తొలి విడత పంపిణీకి తమ ప్రభుత్వం రూ.336 కోట్లు సిద్ధంగా ఉంచిందని బాబు వెల్లడించారు.  బడ్జెట్‌లో రూ.1,150 కోట్లు పెట్టి నిధులు ఎందుకు విడుదల చేయలేదని బాబు ప్రశ్నించారు.

Also Read:అగ్రిగోల్ కుంభకోణం: బాబు, లోకేశ్‌పై ఏపీ స్పీకర్ తమ్మినేని సంచలన ఆరోపణలు

అగ్రిగోల్డ్ విషయమై వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారం బాధితులను మనోవేదనకు గురిచేసిందని.. ఇందుకు అధికార పార్టీ నేతలు క్షమాపణలు చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. అగ్రిగోల్డ్ విషయంలో గత ప్రభుత్వమే అవినీతికి పాల్పడిందని.. టీడీపీ అధినేత చంద్రబాబు పెద్ద మోసగాడని ఆరోపించారు. హాయ్‌ల్యాండ్ భూములును కొట్టేసేందుకు చంద్రబాబు, నారా లోకేశ్ ప్లాన్ వేశారని స్పీకర్ ధ్వజమెత్తారు.

ఎనిమిది రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ కంపెనీ మోసాలకు పాల్పడిందని.. అయితే బాధితులకు పరిహారం అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రపదేశే మాత్రమేనని తమ్మినేని స్పష్టం చేశారు.

హాయ్ ల్యాండ్ భూములను చంద్రబాబు తన కుమారుడి పేరిట రాసివ్వాలని ఒత్తిడి తెచ్చారని... ఈ వ్యవహారంలో సీఎం రమేశ్, యనమల రామకృష్ణుడు చక్రం తిప్పారని తమ్మినేని సీతారాం ఆరోపించారు.

అగ్రిగోల్డ్ బాధితుల తిరుగుబాటు, పోరాటం కారణంగా అప్పటి ముఖ్యమంత్రి అడుగు ముందుకు వేయలేకపోయారని.. ఒక రకంగా హాయ్‌ల్యాండ్ ఆస్తుల్ని బాధితులే రక్షించుకున్నారని స్పీకర్ ప్రశంసించారు. 

Also Read:చంద్రబాబు ట్వీట్ వైరల్: వైఎస్ జగన్ ఇంటి కిటికీలకు రూ.73 లక్షలు

తొలి కేబినెట్ సమావేశంలోనే జగన్మోహన్ రెడ్డి అగ్రిగోల్డ్ సమస్యపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి బడ్జెట్‌లో రూ.1,151 కోట్లు కేటాయించింది.

దీనిలో భాగంగా గత నెల 18న రూ.263 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 3,69,000 మంది అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట లభించనుంది. 

అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకునేందుకు జగన్ ప్రభుత్వం తొలి బడ్జెట్ సమావేశాల్లోనే చర్యలు చేపట్టింది. బాధితులకు డబ్బు ఇవ్వడానికి వీలుగా ఇటీవల ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో రూ.1150 కోట్లు కేటాయించారు. ఈ మొత్తంలోంచి తాజాగా రూ.269.99 కోట్లు మంజూరు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios