Asianet News TeluguAsianet News Telugu

ఆవనిగడ్డ కాలువలో పడ్డ కారు: తోట్లవల్లూరు వద్ద రెండు మృతదేహలు, ఆచూకీ లేని రత్నభాస్కర్

ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తోట్లవల్లూరులోని కాలువలో రెండు  మృతదేహలను ఇవాళ పోలీసులు గుర్తించారు.ఈ మృతదేహలు ఎవరివో  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Police Found  Two dead bodies  in Canal at Thotlavalluru lns
Author
First Published Jul 18, 2023, 1:45 PM IST

విజయవాడ: ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తోట్లవల్లూరులోని కాలువలో  రెండు మృతదేహలను  గుర్తించారు.  ఈ నెల  16వ తేదీ రాత్రి ఆవనిగడ్డ కరకట్ట పంట కాలువలో  కారు బోల్తా పడింది.ఈ కారులో  ప్రయాణీస్తున్న రత్న భాస్కర్ ఆచూకీ లభ్యం కాలేదు.  రత్నభాస్కర్  ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రత్న భాస్కర్ ఫోన్ ను కారులోనే ఉంది.   సోమవారం నుండి   పోలీసులు ఆవనిగడ్డ  పంట కాలువ నుండి దిగువకు  గజ ఈతగాళ్లతో  గాలింపు చర్యలు చేపట్టారు. అయితే  తోట్లవల్లూరు సమీపంలో  రెండు మృతదేహలను  పోలీసులు మంగళవారంనాడు గుర్తించారు.  ఈ రెండు మృతదేహలు  ఎవరివనే  విషయమై  పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు.  

ఈ నెల  16వ తేదీన  ఇంటికి వస్తున్నట్టుగా  కుటుంబ సభ్యులకు  రత్నభాస్కర్  ఫోన్ లో చెప్పారు.  అయితే  ఆ తర్వాత  కొద్దిసేపటికే  తాను  ఉన్న ప్రాంతాన్ని రత్న భాస్కర్ కుటుంబ సభ్యులకు ఫోన్ లో షేర్ చేశాడు. కానీ ఆ తర్వాత అతని ఆచూకీ కన్పించకుండా  పోయింది.  అవనిగడ్డ కరకట్ట కాలువలో  పడిన  రత్నభాస్కర్ కారును మూడు గంటలు కష్టపడి పోలీసులు నిన్న వెలికితీశారు.  కానీ  రత్న భాస్కర్ ఆచూకీ ఇంతవరకు లభ్యం కాలేదు.  

also read:ఆవనిగడ్డ పంటకాలువలోకి దూసుకెళ్లిన కారు: రత్నభాస్కర్ కోసం గాలింపు

రత్న భాస్కర్ ఐస్ ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నాడు. అయితే రత్నభాస్కర్ కారు కాలువలో పడిపోయింది.  అయితే ఈ కారు  డ్రైవర్ సీటు పక్కన  విండో గ్లాస్ తెరిచి ఉంది. దీంతో రత్న భాస్కర్ కారు నుండి దూకాడా అనే కోణంలో కూడ  పోలీసులు కాలువలో గజఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఇవాళ  కాలువలో  రెండు  డెడ్ బాడీలు లభ్యమయ్యాయి. ఈ మృతదేహలను గుర్తించేందుకు  పోలీసులు చర్యలు చేపట్టారు.

Follow Us:
Download App:
  • android
  • ios