Asianet News TeluguAsianet News Telugu

ఎన్డీయేలో ఉండి నెహ్రూను పొగిడిన పవన్ కళ్యాణ్

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు మోతీలాల్ నెహ్రూను ప్రస్తావించారు. ఆయన స్వతంత్ర సంగ్రామానికి విరాళం ఇచ్చినట్టుగానే తాను కూడా సినిమాలు చేసి సంపాదించిన రూ. 10 కోట్లు పార్టీకి విరాళం ఇస్తున్నట్టు వెల్లడించారు.
 

pawan kalyan donate rs 10 crore to janasena party kms
Author
First Published Mar 26, 2024, 8:43 PM IST

జనసేనాని ఈ రోజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన పార్టీకి రూ. 10 కోట్ల విరాళం అందజేస్తూ మోతీలాల్ నెహ్రూను గుర్తు చేశారు. మోతీలాల్ నెహ్రూతో ఆయనను గుర్తు చేసుకున్నారు. స్వతంత్ర పోరాటాన్ని ముందుకు నడిపించడానికి మోతీలాల్ నెహ్రూ కృషి చేశారని వివరించారు. అలాంటి గొప్ప నాయకులు ఉద్యమానికి తమ స్వార్జితాన్ని విరాళంగా ఇచ్చారు. సొంత డబ్బు వెచ్చించి ఉద్యమానికి ఊపిరిలూదారు.

అలాగే.. తాను కూడా తన స్వార్జితాన్ని జనసేనకు విరాళంగా ఇచ్చినట్టు వివరించారు. సదాశయం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసేన ప్రయాణానికి తన వంతుగా రూ. 10 కోట్లు అందజేస్తున్నట్టు తెలిపారు. ఎన్నికల ప్రచార ఖర్చుల నిమిత్తం రూ. 10 కోట్లు ఉపయోగపడుతాయని భావిస్తున్నట్టు వివరించారు. జనసేన పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.

జనసేన పార్టీ బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేలో ఉన్నది. కానీ, బీజేపీ ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ దివంగత నాయకుడు జవహర్ లాల్ నెహ్రూ. జవహర్ లాల్ నెహ్రూ భారత దేశ మొదటి ప్రధానమంత్రి. మోతీలాల్ నెహ్రూ ఈయన తండ్రి. మోతీలాల్ నెహ్రూ కూడా కాంగ్రెస్ నాయకుడే. ఆ పార్టీకి అధ్యక్షుడిగా పని చేశారు. తాజాగా, ఎన్డీయే కూటమిలోని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. మోతీలాల్ నెహ్రూతో తనను పోల్చుకుంటూ వ్యాఖ్యలు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios