Asianet News TeluguAsianet News Telugu

మదనపల్లె అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

దేశ విదేశాలకు మదనపల్లె నుంచి ఎగుమతులు, దిగుమతులు జరుగుతాయి. రాజకీయంగానూ ఈ పట్టణం కీలకమైనది. మదనపల్లె లేకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాలను ఊహించలేం. కాంగ్రెస్ పార్టీ.. 6 సార్లు, టీడీపీ 5 సార్లు, వైసీపీ, సీపీఐలు రెండేసి సార్లు ఇక్కడి నుంచి గెలుపొందాయి. రెడ్డి, కమ్మ, ముస్లిం మైనారిటీ నేతలు మదనపల్లె నుంచి ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. మదనపల్లెలో హ్యాట్రిక్ విజయం సాధించాలని సీఎం వైఎస్ జగన్ కృతనిశ్చయంతో వున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే నవాజ్ భాషాను కాదని.. నిసార్ అహ్మద్‌కు టికెట్ కేటాయించారు.  టీడీపీ టికెట్‌ను షాజహాన్ భాషాకు చంద్రబాబు ప్రకటించడంతో రాజకీయం మలుపులు తిరుగుతోంది. 

Madanapalle Assembly elections result 2024 ksp
Author
First Published Mar 25, 2024, 8:39 PM IST

అన్నమయ్య జిల్లాలో అతిపెద్ద పట్టణం.. మదనపల్లె. వర్తక , వాణిజ్యాలకు ఈ పట్టణం కేంద్రంగా విలసిల్లుతోంది. ముఖ్యంగా టమోటా, ఉల్లి, మిరప మార్కెట్లు మదనపల్లె నుంచి లావాదేవీలు కొనసాగిస్తున్నాయి. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సంస్కృతులు ఇక్కడ అలరారుతున్నాయి. దేశ విదేశాలకు మదనపల్లె నుంచి ఎగుమతులు, దిగుమతులు జరుగుతాయి. రాజకీయంగానూ ఈ పట్టణం కీలకమైనది. మదనపల్లె కేంద్రంగా ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్లు వినిపిస్తున్నాయి. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్నమయ్య జిల్లాగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. రాయచోటిని జిల్లా కేంద్రంగా చేయడం మదనపల్లె వాసులకు ఆగ్రహం తెప్పించింది. రెడ్డి, ముస్లిం మైనారిటీ, బలిజ కమ్యూనిటీ ఓటర్లదే ఇక్కడ ఆధిపత్యం. 

మదనపల్లె అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 .. వర్తక, వాణిజ్యాలకు కేంద్రం :

మదనపల్లె లేకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాలను ఊహించలేం. 1952లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,46,132 మంది. కాంగ్రెస్ , తెలుగుదేశం పార్టీలకు మదనపల్లె కేంద్రం. కాంగ్రెస్ పార్టీ.. 6 సార్లు, టీడీపీ 5 సార్లు, వైసీపీ, సీపీఐలు రెండేసి సార్లు ఇక్కడి నుంచి గెలుపొందాయి. రెడ్డి, కమ్మ, ముస్లిం మైనారిటీ నేతలు మదనపల్లె నుంచి ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి నవాజ్ భాషాకు 92,066 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి దొమ్మాలపాటి రమేశ్‌కు 62,418 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 27,403 ఓట్ల తేడాతో వరుసగా రెండోసారి మదనపల్లిని కైవసం చేసుకుంది. 

మదనపల్లె శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024 .. హ్యాట్రిక్‌పై వైసీపీ కన్ను :

2024 ఎన్నికల విషయానికి వస్తే.. మదనపల్లెలో హ్యాట్రిక్ విజయం సాధించాలని సీఎం వైఎస్ జగన్ కృతనిశ్చయంతో వున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే నవాజ్ భాషాను కాదని.. నిసార్ అహ్మద్‌కు టికెట్ కేటాయించారు. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా టీడీపీ టికెట్‌ను షాజహాన్ భాషాకు చంద్రబాబు ప్రకటించడంతో రాజకీయం మలుపులు తిరుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే నవాజ్ భాషాకు సొంత అన్న షాజహాన్ భాషాకు టికెట్ రావడంతో ఎమ్మెల్యే రగిలిపోతున్నారు.

ఇరు పార్టీలు మైనారిటీ నేతలకు టికెట్లు ఇవ్వడం, ఒకే కుటుంబంలోని కీలక నేతల్లో ఒకరిని అధిష్టానం పక్కకుపెట్టగా.. మరొకరిని అభ్యర్ధిగా ప్రకటించడంతో ముస్లిం వర్గాలు, ఇరు పార్టీల కేడర్ గందరగోళంలో పడింది. టికెట్ రాని ఎమ్మెల్యే నవాజ్ భాషా వైసీపీకి మద్ధతుగా నిలబడతారా.. లేక సొంత అన్న షాజహాన్‌‌కు అండగా తెలుగుదేశం విజయం కోసం పనిచేస్తారా అన్నది హాట్ టాపిక్‌గా మారింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios