Asianet News TeluguAsianet News Telugu

ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని హమీ: సీఈసీతో భేటీ తర్వాత చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోగస్ ఓట్లతో పాటు  ఎన్నికల నిర్వహణకు సంబంధించి పలు అంశాలను  తెలుగు దేశం, జనసేన పార్టీలు సీఈసీ రాజీవ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు.

CEC Rajiv Kumar Assures to conduct  trasnperant elections says Chandrababu Naidu lns
Author
First Published Jan 9, 2024, 12:42 PM IST

విజయవాడ: ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా అన్ని చర్యలు తీసుకుంటామని  కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్ హామీ ఇచ్చారని తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. 

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్  రాజీవ్ కుమార్ బృందంతో  తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ లు  మంగళవారం నాడు విజయవాడలో  భేటీ అయ్యారు.ఈ భేటీ ముగిసిన తర్వాత  పవన్ కళ్యాణ్ తో కలిసి  చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.

also read:ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తో బాబు, పవన్ భేటీ: బోగస్ ఓట్లపై ఫిర్యాదు

విపక్ష పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలపై  అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని సీఈసీ దృష్టికి తీసుకు వెళ్లినట్టుగా చంద్రబాబు చెప్పారు. ప్రజల్లో  తిరుగుబాటు చూసి నకిలీ ఓట్లు చేర్పించేందుకు కుట్ర చేస్తున్నారని సీఈసీ దృష్టికి తీసుకెళ్లినట్టుగా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎన్నికల విధులకు అనుభవం ఉన్న వ్యక్తులను నియమించుకోవాలని  ఈసీని కోరామన్నారు.ఓటరు జాబితాలో అవకతవకలపై కూడ ఫిర్యాదు చేసినట్టుగా చంద్రబాబు చెప్పారు. తాము చేసిన ఫిర్యాదుల విషయంలో  సీఈసీ రాజీవ్ కుమార్ కూడ  తమకు స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. ఎక్కడా కూడ తాము  రాజీపడబోమని  సీఈసీ రాజీవ్ కుమార్ స్పష్టం చేసినట్టుగా చంద్రబాబు వివరించారు. ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయని ఎన్నికల కమిషన్ భరోసా ఇచ్చారని చంద్రబాబు తెలిపారు.

రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా అరాచకాలు జరుగుతున్నాయన్నారు.అవసరమైతే సెంట్రల్ పోలీస్ అబ్జర్వర్లను  కూడ పంపించాలని  చంద్రబాబు డిమాండ్ చేశారు. 

ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని చంద్రబాబు కోరారు.  ఒక్క ఓటు దొంగ ఓటున్నా ఈసీ దృష్టికి  తీసుకెళ్తామన్నారు.రాష్ట్రంలో జరుగుతున్న  అన్ని అరాచకాలను  కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ కు వివరించామన్నారు.

చంద్రగిరి లో ఫామ్ 6 కింద లక్షకు పైగా దరఖాస్తులు ఇచ్చిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు.జాతీయ స్థాయిలో టీచర్లను,అనుభవం ఉన్న వారిని ఎన్నికల విధుల్లో పెడుతున్న విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారు.

సచివాలయ సిబ్బంది,వలంటీర్లతో ఎన్నికల విధులకు ఉపయోగించుకోవాలని ప్రభుత్వం చూస్తుందన్నారు. ప్రభుత్వం చేసే తప్పుడు పనులు వలంటీర్లు,సచివాలయ సిబ్బంది తో చేయించే ప్రయత్నం చేస్తున్నారని  చంద్రబాబు ఆరోపించారు. 2600 మంది మహిళా పోలీసులను ఇప్పుడు బీఎల్ఓలుగా నియమించారన్నారు. 

వై ఏపీ నీడ్స్ జగన్ అని కలెక్టర్లు కూడా క్యాంపెయిన్ చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.తెలంగాణలో ఎన్నికలు సున్నితంగా జరిగాయన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios