Asianet News TeluguAsianet News Telugu

వీక్లీ క్రైమ్ రౌండప్: ప్రేమోన్మాది ఘాతుకం.. మోడల్‌పై రేప్ కేసులో ట్విస్టులు, మరిన్ని

వరంగల్‌‌లో ప్రేమోన్మాది దాడితో ఓ యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో మోడల్‌పై అత్యాచారం కేసు మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. ఇలాంటి నేరవార్తలు మీ కోసం

This week crime roundup
Author
Hyderabad, First Published Jan 12, 2020, 3:09 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

వరంగల్‌‌లో ప్రేమోన్మాది దాడితో ఓ యువతి ప్రాణాలు కోల్పోయిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో మోడల్‌పై అత్యాచారం కేసు మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. ఇలాంటి నేరవార్తలు మీ కోసం

ప్రాణం తీసిన ప్రేమోన్మాదం

వరంగల్‌ అర్బన్ జిల్లా హన్మకొండలోని రాంనగర్‌లో షాహిద్ అనే యువకుడు.. లష్కర్‌సింగారానికి చెందిన ఎంబీఏ విద్యార్ధిని హారతిని గొంతుకోసి దారుణంగా హతమార్చాడు. శుక్రవారం షాహిద్ ఇంటికి హారతి వెళ్లింది. వారిద్దరికి ఏదో విషయంలో గొడవ జరగగా.. మాటామాటా పెరిగి షాహిద్‌ యువతిని కత్తితో దారుణంగా హత్య చేసి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన హారతి రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

Also Read:ప్రేయసి హత్య కేసులో కొత్త ట్విస్ట్: ముందు రేప్ చేసి, ఆ తర్వాత...

యువతిపై దాడి అనంతరం నిందితుడు పోలీసులకు లొంగిపోయాడు. యువతి హత్యకు ప్రేమ వ్యవహారమే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. హారతి కుటుంబానికి తప్పకుండా న్యాయం చేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హామీ ఇచ్చారు. 

మోడల్‌పై అత్యాచారం, ట్విస్టుల మీద ట్విస్టులు

మోడలింగ్ రంగంలో స్థిరపడేందుకు హైదరాబాద్‌కు వచ్చిన యువతిపై ఓ యువకుడు అత్యాచారం చేయగా.. ఈ తతంగాన్ని అతని మిత్రుడు సెల్‌ఫోన్‌లో వీడియో తీశాడు. దీనిపై ఈ నెల 7వ తేదీన మోడల్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అయితే ఫిర్యాదును మార్చి రాయాలంటూ పోలీసులు తనపై ఒత్తిడి తెచ్చాడని ఆమె వాపోయింది. ఈ వ్యవహారంలో యువకుడి తల్లీ రంగంలోకి దిగడంతో కొత్త మలుపు తిరిగింది. సదరు  యువతి తన కుమారుడిని ట్రాప్ చేసి తప్పుడు కేసు పెట్టి 20 లక్షలు డిమాండ్ చేస్తోందని తెలిపింది.

Also Read:ఆమె నా కొడుకుని ట్రాప్ చేసింది.. మోడల్ పై అత్యాచార ఘటనలో నిందితుడి తల్లి

ముందు తన కొడుకుతో పెళ్లికి సిద్ధపడిందని.. అయితే తన కుమారుడు మైనర్ కావడంతో వివాహం కుదరదని తాను తేల్చి చెప్పినట్లు యువకుని తల్లి తెలిపారు. డబ్బు కోసం ఆ యువతి తల్లిదండ్రులు కూడా దిగజారారని.. వాళ్లు కూడా రూ.10 లక్షలు ఇచ్చి సెటిల్ చేసుకోమన్నారని ఆమె పేర్కొంది. 

శృతి మించుతున్న మందుబాబుల ఆగడాలు

హైదరాబాద్‌లో మందుబాబుల ఆగడాలు శృతిమించుతున్నాయి. పీకలదాకా తాగి రోడ్డుపై వీరంగం ఆడుతున్నారు. శనివారం రాత్రి పబ్‌ను మూయించడానికి వచ్చిన పోలీసులతో గొడవకు దిగారు. అదే పబ్‌కు వచ్చిన ఓ యువతిని బైకులతో వెంటాడి, అసభ్యకరంగా  ప్రవర్తించారు. ఈ తాగుబోతులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీరిని కఠినంగా శిక్షించాలని ఆయా ప్రాంతాల్లో జనం కోరుతున్నారు. 

మున్సిపల్ బరిలో ప్రణయ్ హత్య కేసు నిందితుడు

తెలుగునాట సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్‌ హత్య కేసులో నిందితుడు ఎంఏ కరీం తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచాడు. ప్రణయ్ హత్య కేసులో ఇతను ఏ-5గా ఆరోపణలు ఎదుర్కొన్నాడు.

Also Read:ప్రణయ్ హత్య, ఆ తర్వాతి పరిణామాల పూర్తి సమాచారం

మిర్యాలగూడలోని 20, 21 వార్డుల నుంచి కరీం ఇండిపెండెంట్ అభ్యర్థిగటా బరిలోకి నిలిచాడు. ప్రణయ్‌ని హత్య చేయించేందుకు గాను మారుతీ రావు ఓ ముఠాకు సుపారీ ఇచ్చాడు. ఈ పథకంలో కరీం పాలు పంచుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. 

కుక్కపిల్లతో ఎర, యువతిపై అత్యాచారం, హత్య

మతిస్థిమితం లేని యువతికి కుక్క పిల్ల ఇస్తామని మాయమాటలు చెప్పి.. అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గూడురుకు చెందిన మతిస్థిమితం లేని యువతి ఈ నెల 5 రాత్రి ఏదో పనిపై బయటకు వచ్చింది. అప్పటికే ఫుల్లుగా మద్యం సేవించి ఉన్న ఆమెను గమనించిన శివకుమార్, వెంకటేశ్, శరత్, లక్ష్యయ్య గుర్తించారు. కుక్క పిల్ల ఇస్తామంటూ మాయమాటలు చెప్పి.. ఓ పాడుబడిన ఇంట్లోకి తీసుకెళ్లి ఒకరి తర్వాత మరొకరు అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు.

Also Read:కుక్క పిల్ల ఇస్తామని చెప్పి.. యువతిపై లైంగిక దాడి, హత్య

యువతి ఆచూకీ కోసం కుటుంబసభ్యులు ఆ ప్రాంతమంతా వెతికారు. ఆ తర్వాతి రోజు యువతి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహంపై సర్జికల్ బ్లేడ్‌తో కోసిన గాయాలు ఉండటంతో .. పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేసి నిందితులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios