మహిళలు రెండు పాదాలలోనూ మొదటి 3 వేళ్లలో మెట్టె ధరించడానికి ఇష్టపడతారు.
మహిళలు విరిగిన మెట్టెను ఎప్పుడూ ధరించకూడదు. ఇది వైవాహిక జీవితాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
పండుగ రోజుల్లో మెట్టెను మార్చడం శుభప్రదంగా భావిస్తారు.
మధ్యాహ్నం 12 గంటలకు ముందు మెట్టెను మార్చడం మంచిది. ఆ తర్వాత ఎప్పుడూ మార్చకూడదు.
మెట్టె విరిగిపోతే వెంటనే దాన్ని మార్చండి. విరిగిన మెట్టె ధరించడం అశుభంగా భావిస్తారు. అది నెగెటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మహిళలు ఒక్కో పాదానికి ఒక్కో మెట్టె మాత్రమే ధరించాలి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వెండి మెట్టెను మాత్రమే ధరించాలి. బంగారపు మెట్టె ఎప్పుడూ ధరించకూడదు.