Telugu

Silver Mangalsutra: వెండి లాకెట్ తో.. అదిరిపోయే మంగళసూత్రం డిజైన్స్

Telugu

హార్ట్ షేప్ లాకెట్...

సింగిల్ లేయర్ నల్లపూసల చైన్ కి హార్ట్ షేప్ లాకెట్ పెయిర్ చేసి ఉంది. కింద ఒక చిన్న స్టోన్ వేలాడ దీశారు. దీని వల్ల లాకెట్ అందం మరింత పెరుగుతుంది.. నల్లపూసలకే అందాన్ని తెస్తుంది. 

Image credits: jewelleryshopper@instagram
Telugu

లీఫ్ లాకెట్ చైన్ మంగళసూత్రం

చిన్న లేదా పెద్ద నల్లపూసల గొలుసుపై ఇలాంటి లీఫ్ లాకెట్ మంగళసూత్రం అదిరిపోతుంది. ఇందులో గట్టి వెండి తీగలను వాడారు. దీనికి ఉన్న ఎర్ర రాయి అందాన్ని మరింత పెంచుతోంది.

Image credits: jewelleryshopper@instagram
Telugu

క్యూపిడ్ హార్ట్ మంగళసూత్రం

చిన్న చిన్న వెండి, నల్ల పూసల డిజైనింగ్‌తో ఈ క్యూపిడ్ హార్ట్ మంగళసూత్రం చాలా బాగుంటుంది. పొట్టి, పొడవు వెరైటీలలో దీనిని రూ.1000 నుంచి రూ.2500 మధ్య కొనుగోలు చేయవచ్చు.

Image credits: jewelleryshopper@instagram
Telugu

బటర్‌ఫ్లై సిల్వర్ మంగళసూత్రం

రొటీన్ డిజైన్లు కాకుండా, ప్రత్యేకంగా కనిపించాలంటే ఈ బటర్‌ఫ్లై సిల్వర్ మంగళసూత్రం బెస్ట్ ఛాయిస్. ఇందులో పూసలతో పాటు మీనాకారీ రాళ్ల డిజైనింగ్ ఉంది. సంప్రదాయ దుస్తులపైకి  బాగుంటుంది.

Image credits: jewelleryshopper@instagram
Telugu

ట్రెడిషనల్ లాకెట్ సిల్వర్ మంగళసూత్రం

పెళ్లిళ్లు, పార్టీలకు ఈ మంగళసూత్రం పర్ఫెక్ట్ ఛాయిస్. దీని ధర సుమారు రూ. 2000 వరకు ఉంటుంది. వెండి, నల్లపూసల గొలుసుకు సిల్వర్ జర్కన్ లాకెట్ అమర్చారు. ఇది మీ లుక్‌ను మరింత పెంచుతుంది.

Image credits: jewelleryshopper@instagram
Telugu

జర్కన్ స్టోన్ సిల్వర్ మంగళసూత్రం

సాధారణ గొలుసుపై డబుల్ లేయర్ టియర్ డ్రాప్, వేలాడే పూసల వర్క్‌తో ఉన్న ఈ మంగళసూత్రం మీకు రాయల్ లుక్ ఇస్తుంది. కాటన్-సిల్క్ చీరలపై సింగిల్ పీస్‌గా వేసుకున్నా మీరు రాణిలా కనిపిస్తారు.

Image credits: jewelleryshopper@instagram
Telugu

మీనాకారీ ట్విస్టెడ్ మంగళసూత్రం

హాఫ్ సర్కిల్ మీనాకారీ ట్విస్ట్‌తో ఉన్న ఈ మంగళసూత్రం సింపుల్‌గా ఉన్నా చాలా క్లాసీ లుక్ ఇస్తుంది. చీరల మీదకు ఇవి చాలా బాగుంటాయి..

Image credits: jewelleryshopper@instagram

Kamarband Designs: ఈ వడ్డాణం ఒక్కటి చాలు.. రాయల్ లుక్ లో తళుక్కుమంటారు

Kundan Maang Tikka: ట్రెండింగ్ కుందన్ పాపిడి బిళ్లలు..ఓ లుక్కేయండి

Patola Blouse: వర్షాకాలంలో కచ్చితంగా ట్రై చేయాల్సిన పటోలా బ్లౌజులు

Pearl Blouse Designs:ముత్యాలతో ఫ్యాన్సీ బ్లౌజులు క్లాసీ లుక్ గ్యారెంటీ