Telugu

ముఖంపై ముడతలు పోవాలంటే ఏం చేయాలి?

Telugu

ఇంటి చిట్కాలు ఎందుకు మంచివి?

ఖరీదైన క్రీముల్లో కెమికల్స్ ఉంటాయి. అవి చర్మానికి హాని చేస్తాయి. ఇంటి చిట్కాలలో కెమికల్స్ లేకపోవడంతో అవి చర్మాన్ని డ్యామేజ్ చేయవు.

Image credits: Getty
Telugu

కలబంద జెల్

ముఖానికి కలబంద జెల్ వాడితే చర్మం తేమగా ఉంటుంది, ముడతలు తగ్గుతాయి. దీనికోసం ప్రతిరోజూ ముఖానికి కలబంద జెల్ రాసి 15 నిమిషాల తర్వాత కడగాలి.

Image credits: Getty
Telugu

నిమ్మ, తేనె

నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది. తేనె చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ఈ రెండింటినీ కలిపి ముఖానికి రాస్తే మంచి ఫలితం ఉంటుంది. వారానికి 2-3 సార్లు వాడొచ్చు.

Image credits: Freepik
Telugu

కొబ్బరి నూనె మసాజ్

ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ముఖానికి కొబ్బరి నూనె రాసి మసాజ్ చేస్తే ముడతలు తగ్గుతాయి.

Image credits: Freepik
Telugu

పాలు, అరటి ఫేస్ ప్యాక్

ఒక అరటిపండుని చిదిమి, దానికి కొద్దిగా పాలు కలిపి ముఖానికి రాసి 20 నిమిషాల తర్వాత కడగాలి. ఇది ముడతలు రాకుండా ఆపుతుంది.

Image credits: freepik
Telugu

గులాబీనీరు, చందనం

చందనం ముడతల్ని తగ్గిస్తుంది, గులాబీనీరు చర్మాన్ని చల్లబరుస్తుంది. ఈ రెండింటినీ కలిపి ఫేస్ ప్యాక్ గా వేసుకోండి.

Image credits: Social media
Telugu

గుర్తుంచుకోండి!

చర్మం ముడతలు లేకుండా ఆరోగ్యంగా ఉండాలంటే నీళ్లు, నిద్ర చాలా ముఖ్యం.

Image credits: Pinterest

Gold: తక్కువ వెయిట్ లో డైలీవేర్ ఇయర్ రింగ్స్

పెళ్లికి ముస్తాబా? అందమైన మెహందీ డిజైన్లు ఇక్కడే!

ఫార్మర్ అండ్ స్టైలిష్.. రూ. 300 లో అదిరిపోయే ఆఫీస్ వైట్ టాప్స్..

Mehndi Designs: మెహందీ పెట్టుకుంటున్నారా.. ఈ అదిరిపోయే డిజైన్స్ మీకోసం