Woman

నీళ్ల వల్ల జుట్టు రాలిపోతే ఇలా చేయండి

కలుషిత నీటితో జుట్టు రాలడం

చెడు ఆహారాలను తినడం, ఆరోగ్య సమస్యల వల్లే కాదు కలుషిత నీటి వల్ల కూడా జుట్టు రాలుతుంది. 

జుట్టును నిర్జీవంగా చేస్తుంది

మీ జుట్టు డ్రైగా గా, నిర్జీవంగా ఉంటే మీ ట్యాప్ నుంచి వచ్చే వాటర్ లో మెగ్నీషియం, కాల్షియం ఎక్కువగా ఉండటమే కారణం కావొచ్చు. 

జుట్టులో తేమ తగ్గుతుంది

నీళ్లలో ఖనిజాలు ఎక్కువగా ఉంటే మీ జుట్టులో తేమ తగ్గి జుట్టు పొడిబారుతుంది. ఇలాంటి వారు ఫిల్టర్ వాటర్ ను వాడుకోవచ్చు. 

తరచుగా తలస్నానం చేయొద్దు

ప్రతిరోజూ జుట్టుకు షాంపూ పెట్టి బలంగా రుద్ది స్నానం చేస్తే కూడా మీ జుట్టు బాగా రాలుతుంది. నిపుణుల ప్రకారం.. వారానికి  రెండు, మూడు సార్లు మాత్రమే తలస్నానం చేయాలి. 

జుట్టును వేడి నుంచి కాపాడండి

జుట్టుకు వేడి ఎక్కువగా తగిలితే వాటి ప్రోటీన్ నిర్మాణం దెబ్బతింటుంది. వెంట్రుకల చివర్లు రెండుగా చీలిపోతాయి. అలాగే జుట్టు రాలుతుంది. 

జుట్టుకు పోషకమైన ఆహారం

జుట్టు రాలడం తగ్గాలంటే జింక్, బయోటిన్, ఇనుము, విటమిన్ ఇ వంటి పోషకాలుండే ఫుడ్స్ ను తినండి. దీనివల్ల మీ జుట్టు బలంగా, పొడుగ్గా పెరుగుతుంది. 

Find Next One