Woman
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే బెర్రీ పండ్లను తింటే కొలాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీంతో మీ చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.
అవొకాడోలో విటమిన్ ఇ, విటమిన్ సి, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఈ పండును తిన్నా మీ ముఖంపై ముడతలు, మచ్చలు తగ్గి యవ్వనంగా కనిపిస్తారు.
దానిమ్మ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఈ పండు చర్మ వృద్ధాప్య లక్షణాలను తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఈ పండును తింటే మీ వయసెంతో కనిపించదు.
నారింజ పండులో విటమిన్ సి తో పాటుగా యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఈ పండును తింటే డ్రై స్కిన్, ముడతలు, మొటిమలు వంటి సమస్యలు రావు.
విటమిన్ సి, ఇ, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉండే కివీ పండు కొలాజెన్ ఉత్పత్తిని పెంచి మీ ముఖంపై ముడతలను, మచ్చలను తగ్గిస్తుంది.
బొప్పాయి పండు కూడా మీరు యవ్వనంగా ఉండటానికి సహాయపడుతుంది. ఈ పండును తింటే ముఖంపై ముడతలు, గీతలు తగ్గుతాయి.
పుచ్చకాయలో వాటర్ కంటెంట్ 92% వరకు ఉంటుంది. ఇది మన చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పండును తింటే మీరు అందంగా కనిపిస్తారు.