వాడిన తర్వాత బర్నర్ ఆఫ్ చేయడం మర్చిపోకూడదు. బర్నర్ సరిగ్గా పనిచేస్తుందో లేదో ఇప్పుడే చెక్ చేయండి.
స్టవ్ ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే మురికి స్టవ్ ప్రమాదాలకు దారితీస్తుంది.
బర్నర్లలో ఆహారం, మురికి పేరుకుపోతే మంట సరిగ్గా రాక గ్యాస్ లీక్ అవుతుంది.
స్టౌవ్ పై వంట చేసినప్పుడు వేడెక్కుతుంది. అది చల్లారిన తర్వాత తడిబట్టతో బర్నర్ తుడవాలి.
త్వరగా మండే వస్తువులను గ్యాస్ స్టవ్ దగ్గర పెట్టకూడదు. ప్లాస్టిక్ సంచులు, చెక్క వస్తువులు, మందులు లాంటివి అన్నమాట.
వంట చేసేటప్పుడు దుస్తులు లూజ్ గా ఉండకూడదు. వదులైన దుస్తులకు త్వరగా మంట అంటుకుని ప్రమాదాలు జరుగుతాయి.
వంట చేసేటప్పుడు పాత్రలు స్టవ్ మీద సరిగ్గా పెట్టాలి. లేదంటే ప్రమాదాలు జరగవచ్చు.
డైలీ వేర్ కి 2 గ్రాముల్లో బంగారు చెవిపోగులు
పీరియడ్స్ లో పచ్చళ్లు తినొచ్చా?
2025 లో ట్రెండింగ్ పట్టీలు అంటే ఇవే
Gold: కాలేజీ అమ్మాయిలకు బెస్ట్ చైన్ మోడల్స్ ఇవి