Travel
కెనడా ఉత్తర భూభాగాల్లో తీవ్రమైన చలి ఉంటుంది. ఇక్కడ ఉష్ణోగ్రతలు -40°C కంటే తక్కువగా ఉంటాయి. యుకాన్, నునావుట్ ప్రాంతాలు అరోరా బొరియాలిస్ అందాలు చూడటానికి బాగుంటాయి.
సైబీరియాలో ఉష్ణోగ్రతలు -50°C వరకు పడిపోతాయి. అత్యంత శీతల ప్రదేశాల్లో ఒకటైన ఓయ్మ్యాకాన్ ప్రాంతంలో మంచుతో నిండిన అడవులు, గడ్డకట్టిన నదులు దర్శనమిస్తాయి.
ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం అయిన గ్రీన్‌ల్యాండ్‌లో ఉష్ణోగ్రతలు -30°Cకి పడిపోతాయి. ఇక్కడ మంచుతో నిండిన ఫ్జోర్డ్‌లు, హిమానీనదాలు చూడాలని పర్యాటకులు కలలు కంటారు.
నార్వే ఉత్తర ప్రాంతాలన్నీ మంచుతో కూడిన చలికాలాలకు ప్రసిద్ధి. ముఖ్యంగా స్వాల్బార్డ్ లో -20°C కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి. అందుకే సందర్శకులు ఎక్కువగా ఇక్కడికి వస్తారు.
ఐస్‌ల్యాండ్ లోపలి భాగం గడ్డకట్టేలా ఉంటుంది. ఇక్కడ ఉష్ణోగ్రతలు సుమారుగా -20°C ఉంటాయి. మంచు గుహలు, హిమానీనదాల హైకింగ్, భూఉష్ణ వేడి నీటి కొలనులు మిమ్మల్ని మైమరపించజేస్తాయి.
ఫిన్లాండ్ లో శీతాకాలంలో -30°C కంటే తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఇది మంచు ప్రపంచాన్ని కలిగి ఉంటుంది. ఈ దేశం లాప్‌ల్యాండ్ రైన్‌డీర్ సఫారీలు, శాంతా క్లాజ్ గ్రామానికి ప్రసిద్ధి చెందింది.
మంగోలియా చలికాలాలు చాలా చల్లగా ఉంటాయి. ఉష్ణోగ్రతలు -40°C కంటే తక్కువగా ఉంటాయి. స్టెప్పీలు, గోబీ ఎడారి మంచు భూభాగాలుగా మారిపోతాయి.