Travel

100 ద్వీపాల నగరాన్ని చూస్తారా: గోవా కంటే బాగుంటుంది

రాజస్థాన్‌లో 100 ద్వీపాల నగరం

రాజస్థాన్ అంటేనే ఎడారికి ప్రసిద్ధి చెందింది. కాని ఈ రాజస్థాన్‌లో 100 ద్వీపాల నగరం కూడా ఉందని మీకు తెలుసా? విచిత్రంగా అనిపించినా ఇది నిజం.

బాన్స్‌వారా నగరం

ఆ ప్రాంతం పేరు బాన్స్‌వారా నగరం. ఇది త్రిపుర సుందరి మాతా ఆలయం, మాహి డ్యామ్‌కు ప్రసిద్ధి చెందింది. దీన్ని సరస్సుల జిల్లా అని కూడా పిలుస్తారు.

నది మధ్యలో ద్వీపాలు

బాన్స్‌వారా నగరానికి సమీపంలో చాచాకోట ప్రాంతం ఉంది. ఇక్కడ నది మధ్యలో 100 చిన్న ద్వీపాలు ఏర్పడ్డాయి. ఈ ద్వీపాల్లో ప్రజల ఇళ్ళు కూడా ఉన్నాయి.

విదేశీ పర్యాటకుల సందడి

రాజస్థాన్‌కు వచ్చే పర్యాటకులకు ఈ ప్రాంతం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. రాజస్థాన్ మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తారు.

ఇది ఒక హిల్ స్టేషన్

ఈ ప్రాంతం ఒక హిల్ స్టేషన్ లా కనిపిస్తుంది. ఈ ద్వీపాలు ఏర్పడిన నదిలో మాహి డ్యామ్ నీరు వస్తుంది. ఏడాది పొడవునా ద్వీపాలు నీటిలోనే ఉంటాయి.

పర్యాటకానికి ప్రోత్సాహం

రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తోంది. హోటళ్ళు, శాశ్వత ఇళ్ళు నిర్మించడానికి గ్రాంట్లు ఇవ్వాలని ప్రకటించింది.

అడుగు భాగం కూడా కనిపించేంత స్వచ్ఛమైన నది ఏంటో తెలుసా? 

ఏపీలో ఈ ప్రదేశాలను ఒక్కసారైనా సందర్శించాల్సిందే..