మీ ఫోన్ పోయిందా? గూగుల్ మ్యాప్స్‌తో ఈజీగా కనిపెట్టొచ్చు
technology Jul 09 2026
Author: Arun Kumar P Image Credits:pexels
Telugu
ఫోన్ పోయిందా?
ఎంతో ఇష్టమైన మొబైల్ ఫోన్ పోతే ఎవరికైనా చాలా బాధగా ఉంటుంది. ఆ కంగారులో ఏం చేయాలో కూడా తోచదు. మన కాంటాక్ట్స్, ముఖ్యమైన సమాచారం, ఫొటోలు, వీడియోలు.. ఇలా అన్నీ ఫోన్‌తో పాటే పోతాయి.
Image credits: Getty
Telugu
గూగుల్ మ్యాప్ మీకు సాయపడుతుంది
ఇలాంటి సమయంలో మీ ఫోన్‌లోని గూగుల్ మ్యాప్ యాప్ మీకు అండగా నిలుస్తుంది. మీ ఫోన్ ఎక్కడుందో ఈ యాప్ ద్వారా కనిపెట్టవచ్చు.
Image credits: pexels
Telugu
ఈ వెబ్ సైట్ మీకు ఉపయోగపడుతుంది
మరో స్మార్ట్‌ఫోన్, కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ ఉపయోగించి మీ ఫోన్ లొకేషన్ తెలుసుకోవచ్చు. దీని కోసం www.google.com/maps వెబ్‌సైట్‌లోకి వెళ్లి లాగిన్ అవ్వండి.
Image credits: pexels
Telugu
మీ ఈమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్
మీరు పోగొట్టుకున్న ఫోన్‌లో ఉపయోగించిన ఈమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్‌తోనే గూగుల్ మ్యాప్స్‌లో లాగిన్ అవ్వాలి. ఎడమవైపు కనిపించే మూడు గీతల ఐకాన్‌పై క్లిక్ చేయాలి.
Image credits: pexels
Telugu
మీ ఫోన్ లోకేషన్ తెలిసిపోతుంది
'Your Timeline' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. మీరు ఏ సమయంలో ఫోన్ లొకేషన్ తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ తేదీ, నెల, సంవత్సరం, సమయం ఎంటర్ చేయాలి. వెంటనే మీ ఫోన్ లోకేషన్ ను చూపిస్తుంది.