SPORTS
శనివారం, ఎంపిక చేసిన ఆటగాళ్లకు బిసిసిఐ నమన్ అవార్డుతో సత్కరించింది. వారిని ఒకసారి చూద్దాం.
భారత లెజెండరీ ఆటగాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ని సికె నాయుడు జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు.
ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రవిచంద్రన్ అశ్విన్‌ను బిసిసిఐ ప్రత్యేక అవార్డుతో సత్కరించింది.
ప్రపంచవ్యాప్తంగా తన ఫాస్ట్ బౌలింగ్‌కు పేరుగాంచిన జస్ప్రీత్ బుమ్రా ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్‌గా పాలీ ఉమ్రిగర్ అవార్డును అందుకున్నారు.
భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన 2024లో అత్యధిక పరుగులు సాధించి ఉత్తమ మహిళా అంతర్జాతీయ క్రికెటర్ అవార్డును గెలుచుకుంది.
టీమ్ ఇండియా తరపున అద్భుతమైన అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్ర అవార్డును అందుకున్నారు.
భారత మహిళా జట్టుకు అద్భుతమైన అరంగేట్రం చేసిన ఆషా శోభన ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్ర అవార్డును అందుకుంది.