మే 27, మంగళవారం నాడు శని జయంతి. ఈ రోజున శని దేవుని పూజలో కొన్ని ప్రత్యేకమైన వస్తువులు సమర్పిస్తే మంచిది. అవెంటో చూద్దాం.
శని దేవుడికి ఏ నూనె అయినా సమర్పించవచ్చు కానీ ఆవ నూనె అత్యంత శుభప్రదమైందిగా భావిస్తారు.
శని దేవుని పూజలో నువ్వులు సమర్పించడం చాలా ముఖ్యం. నల్ల నువ్వులు సమర్పిస్తే అదృష్టం కలిసివస్తుంది. పితృదోష ప్రభావం తగ్గుతుంది.
శని దేవుని పూజలో నల్ల మినములు సమర్పించాలి. దీనివల్ల శని దేవుని అనుగ్రహం లభిస్తుంది.
శని దేవుడికి నువ్వులతో చేసిన పదార్థాలు నైవేద్యంగా పెట్టాలి. గజక్, రేవడి లాంటివి. నువ్వులు, మినపపప్పుతో చేసిన ఖిచిడీ కూడా శని దేవుడికి చాలా ఇష్టమట.
శని దేవుని పూజలో నీలి రంగు పూలు సమర్పించాలి. శమీ వృక్షం ఆకులు కూడా శని దేవుని పూజలో సమర్పిస్తారు. దీనివల్ల శుభ ఫలితాలు వస్తాయి.