Spiritual
చేతిలో త్రిశూలం, డమరుకం. శరీరంపై విభూతి. గుర్రం, రథంపై ప్రయాణిస్తూ, హర హర మహాదేవ అనే నినాదాలతో నాగ సాధు సన్యాసులు సంగమానికి వస్తున్నారు.
శాహీ స్నానానికి వచ్చిన నాగ సాధువుల చిత్రాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
సూర్యోదయానికి ముందే సంగమంలో హర హర మహాదేవ నినాదాలతో నాగ సాధువులు స్నానం చేశారు.
అమృత స్నానానికి ముందు నాగ సాధువులు శరీరంపై విభూది ధరించి, గుర్రాలు, రథాలపై హర హర మహాదేవ నినాదాలతో సంగమానికి వచ్చారు.
నిర్వాణి-నిరంజని నుండి జూనా అఖాడ వరకు సాధువులు స్నానానికి వెళ్తున్నప్పుడు లక్షలాది మంది భక్తులు వారిని ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు.
గంగానదిలో అమృత స్నానానికి ముందు నాగ సాధువులు ధర్మ ధ్వజానికి నమస్కరించి గంగా స్నానం చేశారు.
మొదటి అమృత స్నానం రోజున నాగ సాధులను చూడటానికి దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వచ్చారు.
ప్రయాగ్‌రాజ్ మహాకుంభ్‌కు వచ్చిన నిర్వాణి అఖాడకు చెందిన బాల నాగ సన్యాసి మొదటి అమృత స్నానం చేశారు. ప్రజలు అతన్ని నారాయణ అవతారంగా భావించి నమస్కరించారు.